ఆ విషయంలో దెబ్బకు దిగొచ్చిన రవితేజ

December 26, 2018 at 3:19 pm

టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటించిన రవితేజ..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత వరుస విజయాలతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న రవితేజ ఇండస్ట్రీలో అందరూ మాస్ మహరాజగా పిలుస్తారు. ఆ మద్య రవితేజకు వరుస పరాజయాలు రావడంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో తానేంటో మరోసారి ప్రూఫ్ చేసుకున్నాడు. కాకపోతే ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో..తర్వాత వచ్చిన సినిమాలు ఘోర పరాజయం అయ్యాయి.

గతంలో మారిగానే.. రవితేజ మాస్ మసాలా సినిమాలు చేస్తున్న ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు. ఇప్పుడు తన కెరీర్ గాడిన పడేసుకోవడానికి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు గుస గుస. అదేంటంటే రెమ్యూనరేషన్. రవితేజ తన ఫీజు విషయంలో ఎప్పుడూ పక్కాగా ఉండేవాడు. సినిమా విడుదల అయి హిట్ అయినా..ఫెయిల్ అయినా..తన రెమ్యూనరేషన్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాడని సమాచారం. అలా కొన్ని సినిమాలు రెమ్యూనరేషన్ విషయలో వదులుకున్నట్లు టాక్. కానీ ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ తన రెమ్యూనరేషన్ విషయంలో దిగివచ్చాడట.

రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మొదట్లో ఈ సినిమాకు రూ.. 10 కోట్ల రెమ్యూనరేషన్ మాట్లాడున్నారట. ఇండస్ట్రీలో వరుసగా పరాజయాలు చవిచూడటంతో..రెమ్యూనరేషన్ ను రూ. 5 కోట్లకు తగ్గించుకున్నాడట. అంతే మరి వరుస ఫ్లాపులు వస్తే..ఎంత గొప్ప హీరో అయినా..రెమ్యూనరేషన్ విషయంలో కిందికి దిగాల్సిందే అని మరోసారి రుజువైంది.

ఆ విషయంలో దెబ్బకు దిగొచ్చిన రవితేజ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts