సుబ్రమణ్యపురం మూవీ రివ్యూ

December 7, 2018 at 6:00 pm

సుబ్రమణ్యపురం మూవీ రివ్యూ
నటీనటులు : సుమంత్ , ఈషా రెబ్బా
దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి
నిర్మాత : సుధాకర్ రెడ్డి
సంగీతం : శేఖర్ చంద్ర

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘ప్రేమకథ’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుమంత్. హీరోగా ఇప్పటి వరకు పందొమ్మిది సంవత్సరాలు దాటుతున్న మంచి హిట్ మాత్రం మనోడికి రాలేదు. ఇటీవలే మళ్ళీ రావా చిత్రంతో హిట్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు సుమంత్ . సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన సుబ్రమణ్యపురం ఈరోజు విడుదల అయ్యింది . ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దామా…

కథ :
సుబ్రమణ్యపురం అనే గ్రామంలో ..వరసగా ఆత్మహత్యలు జరుగుతూంటాయి. ఆత్మహత్య జరగటానికి ముందు ఓ నెమలి వచ్చి సుబ్రమణ్య స్వామి గుడిపైన వాలుతూంటుంది. ఆ గ్రామంలో జనాలు ఎందుకు చనిపోతున్నారు అనేది మిస్టరీ గా మారడంతో దేవుడ్ని అంతగా నమ్మని నాస్తికుడైన కార్తిక్ (సుమంత్) సుబ్రమణ్యపురం లో మనుషుల చావుకు కారణం తెలుసుకోవడానికి వస్తాడు. మరోవైపు పోలీస్ (అమిత్ శర్మ) ఈ ఆత్మహత్యలకు కారణం ఏమిటో కనిపెడదామని ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఇక సుబ్రమణ్యం దేవాలయం గురించి, అక్కడ జరిగే సూసైడ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు కార్తీక్..అతనికి సహాయంగా గర్ల్ ఫ్రెండ్ ఈషా రెబ్బా వస్తుంది. ఇది ఇలా ఉండగా.. ఓ వ్యక్తి (జబర్దస్త్ గెటప్ శీను) వేరే భాషలో రాయబడ్డ సూసైడ్ నోట్స్ ని డీకోడ్ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. ఇలా సుబ్రమణ్యపురం గుడికి సంబంధించి అందరూ తమ ఇన్వెస్టిగేషన్ పనిలో ఉంటారు. ఇంతలో కార్తిక్ ఫ్రెండ్ మేఘన చనిపోతుంది. దాంతో పది రోజుల్లో ఈ మరణాల వెనక ఉన్న మిస్టరీ ఏంటో కనిపెడతానని ఆ ఊరి వాళ్ళతో ఛాలెంజ్ చేస్తారు. అదే సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు..కార్తీక్. సుబ్రమణ్యపురం లో మనుషులు ఎందుకు చస్తున్నారో తెలుసుకున్నాడా ? లేదా ? దేవుని పై పోరాటం చేసిన ఈ మానవుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అన్నది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇప్పటి వరకు దేవుడు గొప్పా మనిషి గొప్పా అనే అంశంపై ఎన్నో సినిమాలు వచ్చాయి..చివరికి దేవుడే గొప్ప అనే సారంశంతో సినిమా ముగుస్తుంది. కొన్ని సినిమాలు మాత్రం సైన్స్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుంటారు. గతంలో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్‌ ఎప్పుడూ సక్సెస్‌ ఫార్మూలానే. నమ్మకాలు-నిజాలు, వాస్తవాలు-ఊహలకు మధ్య అల్లే కథ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ అల్లే కథాకథనాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో హీరోలు డాన్సులు, ఫైట్స్ ప‌రంగా పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అంద‌రినీ ఏడిపించ‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో కాస్త కొరవడినట్టు కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్‌ లోపాలు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఇక సీన్స్ వరస చూస్తే సుబ్రమణ్యపురంలో ఓ సూసైడ్..సిటీలో సుమంత్ లవ్ స్టోరీ సీన్, మళ్లీ సూసైడ్..మరో లవ్ సీన్ ..ఇలా అక్కడో సీన్,ఇక్కడో సీన్ వేసుకుంటూపోయారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే …తేలిపోయింది. కార్తికేయ ఫార్మెట్ నే ఫాలో అయినట్లు అర్దమైపోయేలా ఉంది. సినిమా అయితే ఫ‌స్టాఫ్ అంతా థ్రిల్లింగ్ క‌థ‌లో ల‌వ్ ట్రాక్‌, అలీ స్వామిజీ ట్రాక్‌ను జోడించి సాగ‌దీశాడు.

నటీనటులు :
సుమంత్ న‌టించిన 25వ సినిమా. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సినిమాలు చేయ‌ని సుమంత్ మొదటిసారిగా చేసిన ప్ర‌య‌త్నం అని చెప్పొచ్చు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అంద‌రినీ ఏడిపించ‌న‌క్క‌ర్లేదు. కాబ‌ట్టి పాత్ర ప‌రంగా సుమంత్ చాలా ఈజీగా నటించేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు సుమంత్ . తన నటనతో ఆకట్టుకున్నాడు ,అంతేకాదు ఈ సినిమాని తన భుజస్కంధాలపై మోశాడు. ఈషా రెబ్బా విషయానికి వస్తే..గ్లామర్ గా కనిపించకున్నా..మంచి నటనతో ఆకట్టుకుంది. ఇక సురేశ్‌, సాయికుమార్‌, గిరిధ‌ర్‌, జోష్ ర‌వి, భ‌ద్ర‌మ్ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌లమేర చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక వర్గం :
సినిమా ప్రారంభం రానా వాయిస్ ఓవర్ తో ప్రారంభమై సినిమాకు ఓ గంభీరమైన లుక్ తెచ్చింది. కానీ అది స్క్రీన్ టైమ్ గడిచే కొద్దీ ఆ ఎఫెక్ట్ కోల్పోయింది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి అందించిన నేపథ్య సంగీతం పరవాలేదు అనిపించింది..అక్కడక్కడ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి . ఎడిటింగ్ లో ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. మంచి కథ , కథనం ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. సినిమా కొన్ని సార్లు సీరియల్ ని తలపిస్తుంది.

పాజిటీవ్స్ : సుమంత్‌, కథ, సంగీతం
నెగిటీవ్స్ : స్లో నెరేషన్‌, బోరింగ్ సీన్, కామెడీ మిస్సింగ్

బాటమ్ లైన్: ‘సుబ్రమణ్యపురం’థ్రిల్ మిస్

రేటింగ్ : 2.0/5

సుబ్రమణ్యపురం మూవీ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts