నంద‌మూరిపై మెగా బ్ర‌ద‌ర్స్ చిందులు..రాజకీయమే !

January 11, 2019 at 3:55 pm

ఏపీ అధికార పార్టీ టీడీపీని బ‌లంగా ఎదుర్కోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ మెగా ఫ్యామిలీ.. గ‌డిచిన వారం రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోతోంది. ముఖ్యంగా టీడీపీలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు సంబంధించి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, ఆయ‌న త‌మ్ముడు.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌లు రెచ్చిపోతున్నారు. అయితే, ఈ ఇద్ద‌రు చేస్తున్న‌కామెంట్ల‌కు సోష‌ల్ మీడియాలో రేటింగ్ విష‌యం ప‌క్క‌న పెడితే.. వీరిపై మాత్రం కామెంట్లు పెరుగుతున్నాయి. గ‌తంలో ఎప్పుడో టీడీపీ ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌.. జ‌న‌సేన పార్టీని, పార్టీలోని కార్య‌కర్త‌ల‌ను ఉద్దేశించి ప‌రుషంగా వ్యాఖ్య‌లు చేశార‌నేది నాగ‌బాబు ఆరోప‌ణ‌. అయితే, దీనికి సంబంధించిన ఆధారం ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు.

కానీ, నాగ‌బాబు మాత్ర రోజూ సీరియ‌ర్ ప‌ద్ద‌తిలో బాల‌య్య‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఐదు సార్లు వీడియోలు రిలీజ్ చేసిన నాగ‌బాబు.. తొలి వీడియోలో బాల‌కృష్ణ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. ఆ వెంట‌నే బాల‌కృష్ట ఓ క‌మెడియ‌న్ అని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు. దీనికి అనుబంధంగా త‌న‌కు తెలిసిన బాల‌కృష్ణ ఈయ‌నే.. అంటూ బ్లాక్ అండ్ వైట్ మూవీల రోజుల్లో న‌టించిన ఓల్డ్ బాల‌కృష్ణ పొటో ఒక‌టి చూపించాడు. ఇక‌, తాజాగా ఈ వీడియోల ప‌రంపరం పెరుగుతూ వ‌చ్చింది. దీనిపై బాల‌య్య అభిమానులు సీరియ‌స్ కావ‌డం, ఓ మీడియా ఛానెల్ ఏకంగా చ‌ర్చ చేప‌ట్ట‌డం తెలిసిందే. అయితే, వాస్త‌వానికి నాగ‌బాబు సాధించాల‌ని అనుకుంటున్న‌ది ఏమిటి? బాల‌య్య‌ను బ‌ద్నాం చేయ‌డం ఒక్క‌టేనా? లేక దీని నుంచి రాజకీయంగా ఆయ‌న ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌.

తాజాగా మ‌రోసారి ఫినిషింట్ టచ్ ఇచ్చి మళ్లీ ప్రారంభించడానికి… మర్యాదగా చెబుతున్నా.. అని ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై ఆన్ లైన్ లో విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చాయి. సంబంధం లేని వారెవరో.. నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఆయన రియాక్టయ్యాడు. కానీ తననే అంటున్నా… ఆ వ్యాఖ్యల అర్థం పరమార్థం తెలుసు కాబట్టి… బాలకృష్ణ చిరునవ్వు నవ్వి నో కామెంట్ అనేశారు. దీనిని బ‌ట్టి ఎవ‌రు ఎందుకు రెచ్చిపోవాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత వివాదానికి దారితీస్తున్నాయి. ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్..మెదక్‌లో కుక్కను నిలబెట్టినా.. గెలుస్తుందని వ్యాఖ్యానించారట. అదే విషయం చెప్పి.. తనకు అంత గర్వం లేదని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు అంటూ ట్వీట్ చేశాడు ప‌వ‌న్‌.(మనం గమనిస్తే అసందర్భం టైములో పవన్ ట్విట్) ఇక్కడ ఎన్టీఆర్‌తో పోల్చుకోవడం.. ఓ వింత అయితే.. ఆయనెంతో గర్వంతో రాజకీయాలు చేశారని.. అలాంటి రాజకీయాలు చేయనని చెప్పడం మరో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం. ఇలా అన్నదమ్ములిద్దరూ… ఒకే సారి.. ఎందుకు ఒకే కుటుంబంపై.. విరుచుకుపడి పాపులారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నదానికి మాత్రం రాజకీయం అనే ఆన్సరే వస్తుంది. కొన్ని సార్లు నాయ‌కులు త‌ప్ప‌ట‌డుగులు వేస్తారు! అనేది వింటూ ఉంటాం. కానీ . ఇప్పుడు మెగా బ్ర‌ద‌ర్స్ చేసి చూపిస్తున్నారు. బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై ఎన్ని కౌంట‌ర్లు ఇచ్చినా.. ప్ర‌జ‌లు న‌వ్వుకుని వ‌దిలేస్తారు త‌ప్ప‌వాటిని సీరియ‌స్గా తీసుకోరు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఎన్టీఆర్ గురించి ఎన్ని విధాల బ్యాడ్‌గా మాట్లాడినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు. ఈ విష‌యాన్ని తెలుసుకుంటే బెట‌ర‌నేది విశ్లేష‌కుల మాట‌! మ‌రి మెగా బ్ర‌ద‌ర్స్ వింటారో లేదో చూడాలి.

నంద‌మూరిపై మెగా బ్ర‌ద‌ర్స్ చిందులు..రాజకీయమే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts