సూపర్ స్టార్ రజినీకాంత్ “పేట” రివ్యూ & రేటింగ్

January 10, 2019 at 11:25 am

తార గ‌ణం: సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్‌, సేతుప‌తి, త్రిష‌, నవాజుద్దీన్ సిద్దికీ, మేఘా ఆకాశ్ , త‌దిత‌రులు.. న‌టించారు.
సంగీతం : అనిరుద్
ద‌ర్శ‌కుడు : కార్తీక్ సుబ్బ‌రాజు
నిర్మాత‌: స‌న్ పిక్చ‌ర్స్‌
తెలుగులో వ‌ల్ల‌భ‌నేని అశోక్ విడుద‌ల చేశారు.

త‌మిళ త‌లైవా..ద‌క్షిణాధి అగ్ర‌హీరో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన పేట సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈసినిమాలో సిమ్రాన్, త్రిష మరియు విజయ్ సేతుపతి వంటి అగ్ర తారాగణం న‌టించారు. ర‌జ‌నికి జోడిగా సిమ్రాన్ క‌నిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెర‌కెక్క‌గా అనిరుద్ సంగీతం అందించారు. 2.0 సినిమాకి వచ్చిన ఫలితంతో సూపర్ స్టార్ యొక్క మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిందనే చెప్పాలి. మిగతా సినిమాలతో పాటు ఈ చిత్రం కూడా సంక్రాంతి రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాడిని ముందుకొచ్చింది.మరి చిత్రం ఎంత వరకు అంచానాలను అందుకుందో ఇప్పుడు చూద్దాం..46212207_2430707863612103_6338834681890340864_n

కథేంటంటే…
ఒక హాస్టల్ లో వార్డెన్‌గా ప‌నిచేసే “కాళీ” అక్కడే ప్రాణిక్ హీలర్ గా పనిచేసే (సిమ్రాన్) రజినితో పరిచయం ఏర్ప‌డుతుంది. ఒక ఊహించని ట్విస్ట్ తో రజిని పై ఒక గ్యాంగ్ దాడి చేస్తారు. అసలు రజిని పై ఆ దాడి ఎందుకు జ‌రిగింది. దాడి చేసిన దుండ‌గులు ఎవ‌రు.. ర‌జ‌నికి వారికి ఏం సంబంధం..ర‌జ‌నిని ఎందుకు చంపాల‌నుకున్నారు..? అసలు అక్కడ వార్డెన్ గా పని చేస్తున్న రజిని యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి? త్రిష,విజయ్ సేతుపతి మరియు నవాజుద్దీన్ సిద్ధికీకి పేట కి,ఈ కథకి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగ‌తా క‌థ‌. మిగ‌తా విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే..
సినిమాలో సూప‌ర్‌స్టార్ మార్క్ డైలాగ్స్‌, సీన్లు ఫ‌ర్వాలేదు అనిపిస్తాయి. సినిమాలో యాక్ష‌న్ పార్ట్ అధిక‌మే. అందుకే దానికి సింబాలిక్‌గా యాక్ష‌న్ స‌న్నివేశంతోనే సినిమా ఆరంభ‌మ‌వుతుంది. రివేంజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావ‌డంతో ఆ తాలుకా స‌న్నివేశాలను చూపించేందుకు ఆ ఛాయాల‌ను ముందు నుంచే ప్రేక్ష‌కుల‌ను ప్రిపేర్ చేస్తాడు ద‌ర్శ‌కుడు.

ఎవ‌రెలా చేశారంటే..!
సూపర్ స్టార్ రజిని మరోసారి తనదైన శైలి స్టైలిష్ నటనతో అదరగొట్టేసారు.కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో ట్విస్టులతో మొదటి సగం అంతా బాగానే సాగుతుంది. పిశాచి సినిమా హీరో నాగ్ మరియు మేఘా ఆకాష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అక అనిరుధ్ కూడా సంగీతంతో ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా మాసు మరనం పాట తో మంచి స్కోర్ సాధించాడు. మిగ‌తా పాట‌లకు కూడా మ్యూజిక్‌గా బాగానే కుదిరింది. అయితే ఎప్పటిలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే రేంజ్ లో ఇచ్చారు. ఇలా అభిమానులకు నచ్చే అన్ని అంశాలతో మంచి యాక్షన్ బ్లాక్ మరియు ఆసక్తికర ట్విస్ట్ తో మొదటి సగం అంతా కార్తీక్ సుబ్బరాజ్ బాగానే నెట్టుకొచ్చేసారు. ఇ క విలన్ గా నవాజుద్దీన్ సిద్దికీ బాగానే ఆకట్టుకుంటారు. విల‌న్‌గా సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యాడ‌నే చెప్పాలి. పాత్ర‌లో బాగా కుదిరాడు.. ఒదిగిపోయాడు..

ద‌ర్శ‌కుడు ఎలా తీశాడంటే..

మొద‌టి భాగంలో పాత్ర‌ల ప‌రిచ‌యం..సిమ్రాన్‌, ర‌జ‌నీ మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇక యాక్ష‌న్ సీన్ కూడా ప‌ర్వాలేదనిపిస్తుంది. ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండానే క‌థ‌ను ద‌ర్శ‌కుడు న‌డ‌ప‌గ‌లిగాడు. అయితే అయితే రెండో భాగంలో మాత్రం తేలిపోయారు. జరగబోయే సీన్లను ప్రేక్షకుడు ముందే అంచనా వేసేస్తాడు. దాంతో రోటీన్ రివేంజ్ సినిమాలకు మ‌ళ్లే స‌న్నివేశాలు వ‌స్తుంటాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే రజిని ఫ్లాష్ బ్యాక్ లో అతని భార్యగా త్రిష,అతని స్నేహితునిగా శశి కుమార్,మరో ముఖ్య పాత్రలో సిమ్రాన్ లు తమ పాత్రలకు సరైన న్యాయం చేకూర్చారు. దర్శకుడు క‌ష్ట‌ప‌డ్డ‌ట్లు క‌నిపించినా క‌థ రోటీనిద్‌ది కావ‌డం కూడా ఆయ‌న ఫెయిల్యూర్‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌నిచెప్ప‌వ‌చ్చు. రోటీన్ రివేంజ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేక్ష‌కులు కొన్ని వంద‌ల సినిమాలు చూసి ఉన్నారు. అదే జాన‌ర్‌లో వ‌చ్చిన సినిమా ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. దీనికి తోడు స్క్రీన్‌ప్లే కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతో సమయం ఇవ్వలేదు. రజినీని ఎలివేట్ చేసే సీన్లను బాగానే రాసుకున్నా కథ మొత్తం రొటీన్ గానే అనిపిస్తుంది. ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పాత్రని దర్శకుడు బాగానే రాసుకున్నా రజిని మరియు సేతుపతిల మధ్య వచ్చే కొన్ని సీన్లు సినిమా ట్రాక్ ను పక్క దారి పట్టించినట్టు అనిపిస్తుంది.

ఒక్క వాక్యంలోచెప్పాలంటే..

“పేట” సినిమా కూడా అన్ని సినిమాల్లానే మాములు రివెంజ్ డ్రామానే. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల మినహా తెరపై రజిని మార్క్ స్టైల్ ఆయన నటనా తీరు అభిమానులకు ఏ స్థాయిలో కావాలో ఆ రేంజ్ లోనే ఉంటాయి. కానీ దర్శకుడు ఎన్నుకున్న కథలో కొత్తదనం లోపించడంతో సాధారణ ప్రేక్షకులకి పెద్ద కొత్తగా ఏమి అనిపించదు.

రేటింగ్ : 2.5/5

సూపర్ స్టార్ రజినీకాంత్ “పేట” రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts