బ‌న్నీతో ర‌ష్మిక మంద‌న్న రొమాన్స్‌..

February 7, 2019 at 1:25 pm

నా పేరు సూర్య సినిమా త‌ర్వాత బ‌న్నీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా కూడా చేయ‌లేదు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ బాలీవుడ్ సినిమా రిమేక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో బ‌న్నీ హీరోగా న‌టిస్తున్నారు. దీనికి సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఇందులో బ‌న్నీతో గీత గోవిందం సినిమా ఫేమ్, క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్న‌రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.
Rashmika-Mandanna-Great-Chance-for-the-New-Girl-in-Tollywood

ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ర‌ష్మిక‌ను సెలెక్ట్ చేసిన‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీజులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు తీసిన విష‌యం తెలిసిందే. `సోను కి టిటు కీ స్వీటు` అనే బాలీవుడ్ సినిమాను త్రివిక్ర‌మ్ చిన్న‌చిన్న మార్పుల‌తో రిమేక్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌, హారిక‌-హాసిని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2068153766Allu-Arjun-touches-50L-on-Fb

ప్ర‌స్తుతానికి ర‌ష్మిక ఎంపిక విష‌యంలో త్రివిక్ర‌మ్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదుగానీ.. దాదాపుగా ఖాయ‌మ‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఇక ర‌ష్మిక కూడా ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాలో న‌టిస్తోంది. త‌న‌దైన న‌ట‌న‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ క‌న్న‌డ అమ్మ‌డు వ‌రుస ఆఫ‌ర్ల‌తో ముందుకు వెళ్తోంది.

బ‌న్నీతో ర‌ష్మిక మంద‌న్న రొమాన్స్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts