టాలీవుడ్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఎనిమిదవ చిత్రంగా “ఎఫ్‌2 “

February 7, 2019 at 10:55 am

సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌…యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన ఎఫ్‌2 సినిమా బాక్సీఫీస్ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. 25రోజులు పూర్తి చేసుకుని ఇంకా జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. సంక్రాంతి కానుక‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించింది. సినిమాలు థియేట‌ర్ల‌లో రెండు వారాలు న‌డ‌వ‌డమే క‌ష్టంగా మారిన ఈ రోజుల్లో 25రోజులు దాటినా ఇంకా హాల్స్‌లో సంద‌డి చేయ‌డం విశేషం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా 25రోజుల్లో రూ. 77.87 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది టాలీవుడ్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఎనిమిదవ చిత్రంగా కొన‌సాగుతోంది.

8వ స్థానంలో ఉండగా ‘శ్రీమంతుడు’ రూ. 84 కోట్ల షేర్ తో 7 వ స్థానంలో ఉంది. మరి ‘F2’ ఫుల్ రన్ లో ‘శ్రీమంతుడు’ ను దాటేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ రూ. 34.50 కోట్లు కాగా.. ఇప్పటికే పెట్టుబడికి రెండింతలకు పైగా రాబ‌ట్ట‌గ‌లిగింది. ఈ ఏడాదికి మొదటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌గా నిలిచింది. మంచి కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ అల‌రించారు. వెంక‌టేష్‌కు క‌రెక్ట్ హిట్ ప‌డి దాదాపు ద‌శాబ్దకాలం దాటింది. చివ‌రికి ఎఫ్‌2తో ఆయ‌న కోలుకున్నార‌నే చెప్పాలి. ఫ్యామిలీ ప్యాక్‌గా కుటుంబ స‌మేతంగా ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్ట‌డంతో మంచి వ‌సూళ్లు సాధించింది. ఇక ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల తెలిపిన విష‌యం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ‘F2’ ఇరవై ఐదు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 22.22 cr

సీడెడ్: 8.38 cr

ఉత్తరాంధ్ర: 9.90 cr

కృష్ణ: 5.02 cr

గుంటూరు: 5.41 cr

ఈస్ట్ : 6.56 cr

వెస్ట్: 3.99 cr

నెల్లూరు: 1.87 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 63.35 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.37 cr

టాలీవుడ్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఎనిమిదవ చిత్రంగా “ఎఫ్‌2 “
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts