ఈసారి ఎన్టీఆర్ క‌ష్ట‌మే..

February 6, 2019 at 1:33 pm

తెలుగులో బిగ్‌బాస్ షో ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. సీజ‌న్ వ‌న్‌కు హోస్ట్‌గా హీరో ఎన్టీఆర్ మాంచి ఊపు తెచ్చాడు. సీజ‌న్‌-2కు హీరో నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. కానీ.. ఎన్టీఆర్ హోస్టింగ్‌ను మాత్రం ఎవ్వ‌రూ మ‌రిచిపోరు. ఈ షోకు ఆయ‌న అంత‌లా ఇమేజ్ తెచ్చాడు. అయితే.. ఇప్పుడు సీజ‌న్‌-3 నిర్వహించేందుకు నిర్వాహ‌కులు సిద్ధం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌కు ఎవ‌రు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తారన్న విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే.. వ‌చ్చే సీజ‌న్‌కు మ‌ళ్లీ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ మేర‌కు మాటీవీ నిర్వాహ‌కులు కూడా ఎన్టీఆర్‌తో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని, ఆయ‌న ప్రాథ‌మికంగా ఓకే చెప్పార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. తాజాగా.. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది. బిగ్‌బాస్ షో-3 కి హోస్ట్‌గా ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇందుకు బ‌ల‌మైన కార‌ణం కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మ‌ల్టీ స్టార‌ర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రాజ‌మౌళి సినిమా అంటే వ‌ర్కింగ్ డేస్ ఎంత సీరియస్‌గా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. అంతేగాకుండా.. ఆయ‌న సినిమాలో న‌టించే హీరోలు అది పూర్తి అయ్యేంత‌వ‌ర‌కూ ఆయ‌న‌కు ఫుల్‌టైం కేటాయించాల్సిందే. అంతేగాకుండా.. హీరోల లుక్ కూడా డిఫెరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ సుమారు 200రోజుల కాల్ షీట్లు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్న‌నే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్ సీజ‌న్‌-3కి హోస్ట్‌గా ఎన్టీఆర్ వ్య‌వ‌హ‌రించ‌డం క‌ష్ట‌మేననే టాక్ వినిపిస్తోంది.

ఈసారి ఎన్టీఆర్ క‌ష్ట‌మే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts