నాని ‘జెర్సీ’ ట్రాజెడీ ఎండింగ్!

February 9, 2019 at 4:04 pm

నేచుర‌ల్ స్టార్ నాని క‌థ‌ల ఎంపిక‌లో ఎప్పుడు కూడా కొత్త‌ద‌నం క‌న‌బ‌రుస్తాడు. ప్ర‌తీ సినిమాకు వేరియేష‌న్ చూపిస్తాడు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ సినిమాలో తేడా మ‌న‌కు క‌నిపిస్తోంది. తాజాగా.. ఆయ‌న తాజా సినిమా జెర్సీలో క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్‌తోనే తెలిసిపోయింది.. ఇదొక ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్ అని.

Jersey

అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే.. ఈ సినిమా ఎండింగ్ పాయింట్ గురించి. విషాదంతో చిత్రం ఎండ్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. దీనిని ఓ క్రికెట‌ర్ రియ‌ల్ లైఫ్ ఆధారంగా రూపొందిస్తున్నారు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. ఇండియ‌న్ క్రికెట‌ర్ రామ‌న్ లంబా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

వెట‌ర‌న్ క్రికెట‌ర్ రామ‌న్ ఆడుతున్న క్ర‌మంలో బంతి త‌గిలి గాయ‌ప‌డుతాడు. మూడు రోజుల చికిత్స అనంత‌రం ఆయ‌న మృతి చెందుతాడు. దీంతో జెర్సీ సినిమా కూడా ఇదే విషాదంతో ముగుస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక నాని రెండు పాత్ర‌లలో క‌నిపించ‌నున్నాడు. రంజీ ప్లేయ‌ర్‌గా, అదే స‌మ‌యంలో తండ్రిగా న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. నానికి జోడిగా శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌టిస్తోంది.

నాని ‘జెర్సీ’ ట్రాజెడీ ఎండింగ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts