” ఎన్టీఆర్ మహానాయకుడు” రివ్యూ&రేటింగ్

February 22, 2019 at 4:48 pm

ఎన్టీఆర్‌ మ‌హానాయ‌కుడు రివ్యూ…

టైటిల్ : ఎన్టీఆర్‌ మహానాయకుడు
న‌టీన‌టులు : నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, విద్యాబాలన్‌, సచిన్‌ కేద్కర్‌ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్
నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడును సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేశారుగానీ.. పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేక‌పోయింది. అయితే.. ఇందులో ఎన్టీఆర్‌పాత్ర‌లో బాల‌య్య, బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యాబాల‌న్ మెప్పించారు. క‌థానాయ‌కుడు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్ట‌డంతో ఒత్తిడి అంతా రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుపై ప‌డింది. ఈ క్ర‌మంలోనే విడుద‌ల తేదీపై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. కొన్ని అద‌న‌పు సీన్లు కూడా చిత్రీక‌రించారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందు తెచ్చారు. అయితే.. ఈ భాగ‌మైనా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందో లేదో తెలుసుకుందాం..Dz-1aMTU8AAd79R

క‌థ ఏమిటంటే..
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌ల‌య్యే అంశంతో ఎండ్ అవుతుంది. స‌రిగ్గా ఇక్క‌డి నుంచే ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా మొద‌లైంది. తెలుగు దేశం పార్టీ చిహ్నాన్ని రూపొందిస్తూ మొద‌ల‌వుతుంది. ఇక ఆ త‌ర్వాత ప్ర‌చారంలోకి వెళ్ల‌డం.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టడం.. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం.. నాందెడ్ల భాస్క‌ర్‌రావు ఎపిసోడ్‌తో ఫ‌స్టాఫ్ ఎండ అవుతుంది. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ ఢి్ల్లీకి వెళ్లి రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌డం.. తిరిగి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌డుతారు. ఆఖ‌రికి.. బ‌స‌వ‌తార‌కం మృతితో సినిమా ఎండ్ అవుతుంది. మ‌హానాయ‌కుడులో ఈ అంశాలు త‌ప్ప మ‌రేవీ లేవు.

ఎలా ఉందంటే..

మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడుతోనే ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైంది. క్రిష్‌, బాల‌య్య ఎన్టీఆర్ జీవితంలో అన్ని అంశాల‌ను చూపించ‌లేర‌ని. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే రిపీట్ అయింది. ఎన్టీఆర్ జీవితంలోని అత్యంత కీల‌క అంశాల‌ను వారు ట‌చ్ చేయ‌లేదు. చంద్ర‌బాబు వెన్నుపోటు ఎపిసోడ్ ఇందులో లేనేలేదు. ఇంకా చంద్ర‌బాబే ఎన్టీఆర్‌ను కాపాడిన‌ట్లు చూపించారు. ప్ర‌జాస్వామ్యాన్ని చంద్ర‌బాబు కాపాడిన‌ట్లు చూపించారు. ఎన్టీఆర్ రాజ‌కీయంగా ఎదుర్కొన్న విష‌యాల జోలికి వెళ్ల‌లేదు. కేవ‌లం ఎన్టీఆర్ జీవితంలోని అంశాల్లో త‌మ‌కు న‌చ్చిన‌వాటిని తీసుకుని ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా తీసిన‌ట్లు ఉంద‌ని చెప్పొచ్చు.

ఎవ‌రెలా చేశారంటే..
ఎన్టీఆర్ క‌థానాయుడులో ఎన్టీఆర్‌పాత్ర‌లో బాల‌య్య జీవించారు. ఇప్పుడు ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాలోనూ ఎన్టీఆర్ పాత్ర‌కు బాల‌య్య నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ప‌లు స‌న్నివేశాల్లో అచ్చం ఎన్టీఆర్‌లాగానే ఆయ‌న క‌నిపించారు. అయితే.. ఆయ‌న వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర కావ‌డంతో బాల‌య్యకు క‌లిసివ‌చ్చింది. ఇక బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ కూడా నూటికి నూరు శాతం న్యాయం చేశారు. చంద్ర‌బాబు పాత్ర‌లో రానా క‌రెక్టుగా సూట్ అయ్యారు. నాదెండ్ల భాస్క‌ర్‌రావు పాత్ర‌లో స‌చిన్‌కేద్క‌ర్ ఆక‌ట్టుకున్నాడు. కీర‌వాణి త‌న‌దైన సంగీతాన్నిసినిమాకు అందించారు.

చివరగా ..మహానాయకుడు కథ ముగింపు “అసంపూర్ణం”

రేటింగ్ : 3.25/5

” ఎన్టీఆర్ మహానాయకుడు” రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts