బోయపాటిపై రామ్ చరణ్ ప్రెస్ పోటు

February 5, 2019 at 4:20 pm

విన‌య విధేయ రామ సినిమా వ‌చ్చింది.. పోయింది.. బిజినెస్ మొత్తం క్లోజ్ అయింది.. కానీ దీనికి సంబంధించి ఓ ఎపిసోడ్ మాత్రం ఇంకా న‌డుస్తూనే ఉంది. అస‌లీ సినిమా ఎందుకు డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది..? దీనికి కార‌ణాలేమిటి..? కార‌కులెవ‌రు..? అన్న‌దానిపై ట్రోలింగ్ కొన‌సాగుతూనే ఉంది. మొత్తంగా ఇంత చెత్త‌గా బోయ‌పాటి కావాల‌ని తీశాడా..? లేక రాంచ‌ర‌ణే అతి చేశాడా..? అన్న‌ది కూడా ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రికివారు అనేక ఊహాగానాలు చేస్తున్నారు.

అయితే.. బాల‌య్య‌బాబుకు, బోయ‌పాటికి ఉన్న స‌త్సంబంధాల నేప‌థ్యంలో బోయ‌పాటి కావాల‌నే రాంచ‌ర‌ణ్‌ను బ‌లి చేశాడ‌ని మెగా ఫ్యామిలీ అభిమానులు అంటుంటే.. నంద‌మూరి అభిమానులు కూడా త‌మ‌దైన శైలిలో ఎదురుదాడి చేస్తున్నారు. అయితే.. ఇది చ‌ల్లారుతుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో హీరో రాంచ‌ర‌ణ్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి మ‌రీ కెల‌క‌డంతో విష‌యం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. దీంతో ఆయ‌న విడుద‌ల చేసిన ప్రెస్‌నోట్‌ స‌రికొత్త లొల్లికి దారి తీసింది. ఎందుకంటే.. రాంచ‌ర‌ణ్ అలా తెలివిగా రాశాడు మ‌రి.

రాంచ‌ర‌ణ్ ఆ ప్రెస్‌నోట్‌లో డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను, ఎగ్జిబిట‌ర్ల‌ను, పాత్రికేయుల‌ను.. టెక్నీషియ‌న్ల‌ను, నిర్మాత దాన‌య్య‌ను ఇలా అంద‌రినీ త‌ల‌చుకుంటూ క‌`త‌జ్ఞ‌త‌లు చెప్పాడుగానీ.. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నును మాత్రం ఎక్క‌డ కూడా ప్ర‌స్తావించ‌లేదు. ఇంత‌మందికి క‌`త‌జ్ఞ‌త‌లు తెలిపిన రాంచ‌ర‌ణ్ బోయ‌పాటి మ‌రిచిపోవ‌డంతో అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కావాల‌నే బోయ‌పాటిని వ‌దిలేశాడ‌ని, విన‌య విధేయ రామ సినిమా డిజాస్ట‌ర్‌కు ఆయ‌నే కార‌ణ‌మ‌ని రాంచ‌ర‌ణ్ చెప్ప‌క‌నే చెప్పేశాడ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దీంతో సినిమా మొద‌టి నుంచీ బోయ‌పాటికి నిర్మాత దాన‌య్య‌కు ఒరుగులు కుద‌ర‌డం లేద‌ని, అలాగే బోయ‌పాటికి రాంచ‌ర‌ణ్‌కు మ‌ధ్య కూడా స‌రిగా స‌ఖ్య‌త లేద‌ని ఊహాగానాల‌కు తాజాగా విడుద‌ల చేసిన ప్రెస్‌నోట్‌తో తేలిపోయింద‌నే చెప్పొచ్చు. సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్‌లో ఈ సినిమాకు మొత్తం బాధ్యుడు రాంచ‌ర‌ణేన‌ని బోయ‌పాటి చెప్పి తెలివిగా త‌ప్పించుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్రెస్ నోట్‌లో బోయ‌పాటికి క‌`త‌జ్ఞ‌త‌లు చెప్ప‌కుండా.. రాంచ‌ర‌ణ్ కూడా అంతేతెలివిగా ఆయ‌న‌ను బాధ్యుడిని చేశాడ‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ఇది ముందుముందు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి మ‌రి.

బోయపాటిపై రామ్ చరణ్ ప్రెస్ పోటు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts