రామ్ చ‌ర‌ణ్‌కు బోయ‌పాటి కౌంట‌ర్‌

February 8, 2019 at 12:47 pm

విజ‌యం సాధిస్తే అంద‌రూ మెచ్చుకునే వాళ్లే…ఓడిపోతే మాత్రం మ‌నం ఒంట‌రే..ఇప్పుడు ఇదే కొటేష‌న్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనివాస్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. విన‌య విధేయ రామ సినిమా ప్లాప్ ఎపిసోడ్ త‌ర్వాత ఆ భారాన్ని ఎవ‌రూ మోయ‌లేక ఒక‌రిపై ఒక‌రు రాళ్లు విసురుకునే కార్య‌క్ర‌మానికి తెర‌లేసింది. తాజాగా క‌థానాయ‌కుడు రాంచ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు రాసిన లేఖ‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీనును ప‌రోక్షంగా నిందించారు.
లేఖ‌లో రాంచ‌ర‌ణ్ ఏం రాసాశారంటే.. ప్రియ‌మైన ప్రేక్ష‌కులారా..మీరెంత‌గానో ఆశ‌లు పెట్టుకున్న మా విన‌య విధేయ రామ సినిమా మీ అంచ‌నాల‌ను అందుకోలేక పోయింది. ఈ సినిమా కోసం ప‌నిచేసిన సాంకేతిక నిపుణుల‌కు ఇత‌ర విభాగాల వారికి….ముఖ్యంగా నిర్మాత డివీవీ దానయ్య‌కు ప్ర‌త్యేక‌ క‌`త‌జ్ఞ‌త‌లు అని చెప్పారు.Boyapati-Ram-Charans-Is-a-Real-Quickie-1

భ‌విష్య‌త్‌లో మంచి సినిమాలు తీయడానికి ప్ర‌య‌త్నం చేస్తాను మీరు. ఇంత‌కు ముందులాగే మాపై మీ ఆద‌రాభిమానాల‌ను చూపండి అంటూ లేఖ‌ను ముగించారు. అయితే రాంచ‌ర‌ణ్ లెట‌ర్ అయితే రాశారు గాని…అందులో త‌న త‌ప్పేమీ లేద‌న్న‌ట్లుగా రాసుకురావ‌డం..ద‌ర్శ‌కుడి లోపం వ‌ల్లే సినిమా ప్లాప్ అయింద‌నే అర్థంలో సారాంశం ఉండ‌టం ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాంచ‌ర‌ణ్ టాలీవుడ్ ట్రాక్ అంత స‌క్క‌గా ఏమిలేద‌ని..విన‌య విధేయ రామ కంటే అట్ట‌ర్ ప్లాప్ అయిన సినిమాలున్నాయి. రాంచ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు రాసిన లెట‌ర్‌లో త‌న‌ను నిందించిన‌ట్లుగా ఉంద‌నే విష‌యంపై నిర్మాత దాన‌య్య వ‌ద్ద బోయ‌పాటి గ‌ట్టిగానే నిల‌దీసినట్లు స‌మాచారం. మీరు తీసిన బ్రూస్‌లీ ఎంత క‌లెక్ష‌న్లు సాధించింద‌ట్టు పేర్కొన్న‌ట్లు స‌మాచారం. దానికి దాన‌య్య స‌మాధానం చెప్ప‌కుండా మిన్న‌కుండిపోయార‌ట‌.Boyapati-Srinu-Next-Movie-W

అప్పుడెందుకు రాంచ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు లెట‌ర్ రాయ‌లేదంటూ నిల‌దీశార‌ట‌. వాస్త‌వానికి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగా విన‌య విధేయ రామ అంత‌గా ఏం న‌ష్ట ప‌ర్చ‌లేద‌నే చెప్పాలి. మొత్తం పెట్టుబ‌డిలో 6కోట్ల‌కు మించి న‌ష్ట జ‌ర‌గ‌లేద‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. అదే బ్రూస్‌లీ సినిమా అయితే దాన‌య్య‌ను…బ‌య్యార్ల‌ను నిలువునా మంచేసింది. మొత్తం పెట్టుబ‌డిలో 30శాతం వెనక్కురాలేద‌ట‌. అయినా అయిపోయిన పెళ్లికి ఇప్పుడు భ‌జాలు వాయించుకోవ‌డం వ‌`థా అంటూ సినీ వ‌ర్గాలు హిత‌వు ప‌లుకుతున్నాయి. మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో ఆగుతుందో లేదో చూడాలి

రామ్ చ‌ర‌ణ్‌కు బోయ‌పాటి కౌంట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts