బోయ‌పాటిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన రాంచ‌ర‌ణ్‌

February 7, 2019 at 3:31 pm

విన‌య విధేయ రామ‌.. ఇదేమి క‌ర్మ అన్న‌ట్టుగానే త‌యారైంది ఈ సినిమా ప‌రిస్థితి. టాలీవుడ్‌లో భారీ డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయిన ఈ సినిమా మంట‌లు ఇంకా చ‌ల్లార‌డం లేదు. ద‌ర్శ‌కుడికి నిర్మాత‌కు మ‌ధ్య‌, హీరోకు ద‌ర్శ‌కుడికి మ‌ధ్య‌, మెగాఫ్యామిలీ, నంద‌మూరి ఫ్యామిలీ అభిమానుల‌కు మ‌ధ్య తీవ్ర స్థాయిలో గ్యాప్‌ను పెంచేసింది. ఈ డిజాస్ట‌ర్‌కు కార‌ణం నువ్వంటే.. నువ్వ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరో లోలోప‌ల అనుకుంటున్నారు. అయినా.. బ‌య‌ట‌కు కొన్ని విష‌యాలు వ‌స్తూ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.ram-charan-49132-1

తాజాగా.. ఈ సినిమా లొల్లికి సంబంధించి మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాతో బ‌య్య‌ర్ల‌కు సుమారు రూ.30కోట్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు. అయితే.. బ‌య్య‌ర్ల‌కు త‌లో రూ.5కోట్లు ఇద్దామ‌ని, దీంతో వారు న‌ష్ట‌పోయిన దాంట్లో స‌గం తిరిగి ఇచ్చిన‌వాళ్లం అవుతామ‌ని ఓ ప్ర‌తిపాద‌న‌ను హీరో రాంచ‌ర‌ణ్ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇందుకు నిర్మాత దాన‌య్య కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. బోయ‌పాటి వ‌ర‌కు వ‌చ్చే స‌రికి ఆయ‌న ఒప్పుకోన‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం కోటికిపైగా మాత్ర ఇస్తాన‌ని ఆయ‌న అన్న‌ట్లు స‌మాచారం.DT4Y7mqVwAAji4R

అయితే.. దీనిపై చ‌ర్చించేందుకు కొంద‌రు పెద్ద‌మ‌నుషుల స‌మ‌క్షంలో కూర్చున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి, నిర్మాత దాన‌య్య మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఒకానొక ద‌శ‌లో బూతులు కూడా తిట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. రూ.15కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న నువ్వు.. రూ.5కోట్లు ఇవ్వ‌డానికి ఎందుకు ముందుకు రావ‌డం లేద‌ని దాన‌య్య విరుచుకుప‌డ్డార‌నే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. మొన్న‌ప్రెస్‌నోట్ బోయ‌పాటిని ఇరికించిన రాంచ‌ర‌ణ్‌.. తాజాగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపు ప్ర‌తిపాద‌న‌తో టార్గెట్ చేశార‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.

బోయ‌పాటిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన రాంచ‌ర‌ణ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts