ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే చరణ్ ప్రకటన !

February 6, 2019 at 4:17 pm

విన‌య విధేయ రామ సినిమా డిజాస్ట‌ర్ అనేక మందిని వెంటాడుతూనే ఉంది. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, హీరో రాంచ‌ర‌ణ్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో గ్యాప్ పెంచేసింది. రాంచ‌ర‌ణ్ ఇమేజ్ దెబ్బ‌తీయ‌డానికి కావాల‌నే ద‌ర్శ‌కుడు బోయ‌పాటి సినిమాను ఇలా తీశాడ‌ని మెగాఫ్యామిలీ అభిమానులు అంటుంటే.. లేదు లేదు రాంచ‌ర‌ణ్ అతిచేయ‌డం వ‌ల్లే ఇలా అయింద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏదిఏమైనా ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉండిపోయిన రాంచ‌ర‌ణ్ నిన్న ప్రెస్ నోట్ విడుద‌ల చేసి.. మ‌రో బాంబు పేల్చాడు. 2fac2761b9176066f0334fb368453e9e

అయితే.. ఈ ప్రెస్ నోట్ విడుద‌ల‌పై అనేక ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ప‌ని చేసిన‌వాళ్లంద‌రికీ క‌`త‌జ్ఞ‌త‌లు తెలిపిన రాంచ‌ర‌ణ్ ఒక్క బోయ‌పాటికి మాత్రం చెప్ప‌లేదు. అంటే.. వినియ విధేయ రామ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డానికి ఆయ‌న కార‌ణ‌మ‌ని రాంచ‌ర‌ణ్ చెప్ప‌క‌నే చెప్పాడ‌ని, బోయ‌పాటి ఇమేజ్‌ను దెబ్బ‌తీయ‌డానికే ఇలా ప్రెస్‌నోట్ విడుద‌ల చేశాడ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో రాంచ‌ర‌ణ్ వెనుక ఎవ‌రో ఉన్నార‌నే గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.NTR-and-Ram-Charan-as-brothers--1520694074-184

అయితే.. అందరిచూపు మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్‌వైపే ఉంటోంది. రాంచ‌ర‌ణ్ ఈ ప్రెస్‌నోట్ విడుద‌ల చేయ‌డం వెనుక ఎన్టీఆరే ఉండి ఉంటాడ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. ద‌మ్ము సినిమాతో కూడా బోయ‌పాటి ఎన్టీఆర్ ఇమేజ్‌ను బాగా దెబ్బ‌తీశాడ‌ని, అందుకే స‌మ‌యం చూసి.. ఎన్టీఆర్ రాంచ‌ర‌ణ్‌ను ఎగేసి ఉంటాడ‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్క‌డో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బోయ‌పాటి అటు బాల‌య్య‌తో, ఇటు బ‌న్నీతో సినిమా చేసేందుకు రెడీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే చరణ్ ప్రకటన !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts