ఆ ఇద్దరుపై పాయింట్ బ్లాక్‌లో గురి పెట్టిన రాంగోపాల్ వ‌ర్మ

February 11, 2019 at 11:20 am

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు…తెలుగు నేల‌పై అటు రాజ‌కీయాల్లోనూ..ఇటు సినీ రంగంలోనూ చెర‌గ‌ని ముద్ర వేశారు. తెలుగు జాతి కీర్తిని, ప్ర‌తిష్ఠ‌ను ద‌శ‌దిశాలా ఇనుమండిప‌జేశార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించారు. తెలుగు ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచారు. ఆయ‌న 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి….అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ త‌ప్ప మిగ‌తా పార్టీల‌కు పాలించే అధికారం..హోదా…అర్హ‌త లేద‌న్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితుల నుంచి అప్ర‌తిహ‌త విజ‌యాన్ని అందుకున్నారు. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు.. ఆయితే ఆయ‌న ఎదుగుద‌ల ఏస్థాయిలో ఉందో…ఆయ‌న ఆఖ‌రిలో అంధ‌పాతానికి కూడా అలానే ప‌డిపోయారు.20VJPAGE5RGVe

వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను కుటుంబ స‌భ్యులు ఆహ్వానించ‌లేదు.. అంద‌రూ దూరంగానే గ‌డిపారు….లక్ష్మీపార్వ‌తిని ఆయ‌న వివాహ‌మాడ‌టంతో అంతా దూర‌మ‌య్యారు.. అదే స్థాయిలో ఆయ‌న ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీశారు..రాజ‌కీయంగా కుట్ర‌లు జోరుగా సాగాయి. అల్లుడు చంద్ర‌బాబు పార్టీలోకి జోర‌బ‌డి…మెల్ల‌గా ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకున్నారు…చివ‌రికి మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం క‌లిగిన ఎన్టీలాంటి మ‌హానుభావుడిపైనే చెప్పులు విసిరేయించ‌గ‌లిగారు.. ఆ క్షోభ‌తోనే ఎన్టీఆర్ మ‌ర‌ణించారు.. అనే అభిప్రాయ‌మే ఎక్కువ‌గా జ‌నాల్లో ఉంది. ఇప్పుడు అదే పాయింట్‌పై నేను పెద్దాయ‌నపై నిజాలు మాత్ర‌మే చెబుతాను…పెద్దాయ‌న‌పై అబద్ధాలు చెప్ప‌ను అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా మొద‌లుపెట్టిన రాంగోపాల్‌వ‌ర్మ‌…నంద‌మూరి..నారా వారి ఫ్యామిలీల‌పై టార్గెట్ చేస్తూ ట్రిగ్గ‌ర్ నొక్కిన‌ట్లు సుస్ప‌ష్ట‌మ‌వుతోంది.Dy-8_PLU8AAVcSz
స‌కుటుంబ కుట్ర‌ల చిత్రం అంటూ ఆయ‌న చేసిన కామెంట్ వేడి పుట్టిస్తోంది. ఈనెల 14న ట్రైల‌ర్ను విడుద‌ల చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. క‌థానాయ‌కుడు సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయిన నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్‌కి భారతరత్న రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబేనంటూ దర్శక నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ బాంబ్ పేల్చారు. ఆయ‌న చేసిన కామెంట్ ఇప్పుడు రాజ‌కీయ‌, సినీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చూడాలి. ఈ చ‌ర్చ‌పై చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో..?

ఆ ఇద్దరుపై పాయింట్ బ్లాక్‌లో గురి పెట్టిన రాంగోపాల్ వ‌ర్మ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts