రవితేజకు కొత్త కష్టం …చిక్కుల్లో డిస్కో రాజా !

February 28, 2019 at 11:27 am

అదేమిటోగానీ.. మాస్ మ‌హరాజ ర‌వితేజ‌కు కాలం అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. ఆయ‌నేదో త‌లిస్తే.. మ‌రేదో జ‌రుగుతుంది. చాలా కాలంగా తీసిన ప్ర‌తీ సినిమా ఫ‌ట్టే అవుతుందిగానీ.. హిట్ మాత్రం కావ‌డం లేదు. అయితే.. ఈ మాధ్య ఆయ‌న క‌థ‌ల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. వ‌చ్చీ రాని క‌థ‌ల‌కు ఓకే చెప్పేయ‌కుండా కాస్తా వెనుకాముందు ఆలోచిస్తున్నాడు. ఇందులో భాగంగానే సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో.. మైత్రీ మూవీస్ నిర్మాణంలో సినిమాను ప‌క్క‌కు పెట్టేసిన విష‌యం తెలిసిందే.

ఇక ఇదే స‌మ‌యంలో వీఐ ఆనంద ద‌ర్శ‌క‌త్వంలో తాళ్లూరి రామ్ నిర్మాణంలో సినిమాకు ర‌వితేజ ఓకే చెప్పేశాడు. దీనికి డిస్కో రాజా అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కో రాజా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే, ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉందిగానీ.. తాజాగా… ర‌వితేజ‌కు కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. డిస్కోరాజా స్రిప్ట్‌.. స‌మంతా న‌టిస్తున్న కొరియ‌న్ క‌థాంశ రిమేక్‌ ఓ బేబీ సినిమా స్క్రిప్ట్ చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయ‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

ఈ టాక్‌తో కంగుతిన్న ర‌వితేజ వెంట‌నే ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. ఈ స్ర్కిప్ట్‌లో మార్పులు చేయాల‌ని, పూర్తిగా రీ రిటై చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. దీంతో ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ కూడా స్పందించి, దానిని పూర్తిగా మార్చే ప‌నిలో నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. ముందుముందు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా.. త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. సినిమా టైటిల్‌ను కూడా మారుస్తారా? లేక అలాగే ఉంచి.. క‌థ‌నే మారుస్తారా..? అన్న‌ది తెలియాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా.. ర‌వితేజకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి మ‌రి.

రవితేజకు కొత్త కష్టం …చిక్కుల్లో డిస్కో రాజా !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts