దిల్ రాజుకు సమంత రిక్వెస్ట్ …

February 7, 2019 at 12:07 pm

ఏమాయ చేశావె సినిమాతో హీరోహీరోయిన్లుగా జ‌త‌క‌ట్టిన అక్కినేని నాగ‌చైత‌న్య..స‌మంత‌..ఆ త‌ర్వాత అదే కెమిస్ట్రీని నిజ జీవితంలోనూ కొన‌సాగించారు. అప్ప‌టి నుంచి ఎవ‌రికి వారు…మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమాల‌కు ఒక్క‌టిగా ప‌నిచేస్తూ త‌మ ప్రేమ‌ను కొన‌సాగించారు. మ‌నం సినిమాలో మంచి అభిన‌యంతో..మావ‌య్య అక్కినేని నాగార్జున‌కు త‌ల్లిగా..న‌టించి ఆయ‌న ద‌గ్గ‌ర మంచి మార్కులే సంపాదించారు. దీంతో చై సామ్ ల‌వ్‌..పెళ్లి పీట‌ల‌కెక్కింది…ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇక తాజ క‌బురేంటంటే..స‌మంత బ్యాకు టు బ్యాక్ హిట్ల‌తో క‌థానాయిక‌గా దూసుకెళ్తుండ‌గా నాగ‌చైత‌న్య‌కు మాత్రం ఒక్క హిట్లు ప‌డ‌టం లేదు.

దిల్‌ రాజు బ్యానర్లో త్వరలోనే నాగచైతన్యతో ఒక సినిమా వుందంటూ ఇటీవ‌ల విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ విషయాన్ని దిల్‌ రాజు కూడా స్వయంగా చెప్పాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ వెనుక ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఉంది. దీంతో దిల్‌రాజు వ‌ద్ద ఉన్న చ‌నువుతో చైత‌న్య‌తో ఒక మంచి సినిమా తీయండి అంటూ రిక్వెస్ట్ చేసిందంట‌. దీంతో ఆయ‌న కూడా స‌మంత రిక్వెస్ట్‌ను కాద‌న‌లేక‌పోయార‌ట‌. వాస్త‌వానికి జోష్‌ ఫ్లాప్‌ అయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీతో రాజుకి కాస్త డిస్టెన్స్‌ వచ్చింది. అందుకే చైతన్యతో మళ్లీ సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌ ఎలా కలిసినట్టు? దీనికి కారణం సమంత అని చెబుతున్నారు.

’96’ రీమేక్‌ కోసం సమంతని సంప్రదించిన దిల్‌ రాజుతో తన భర్తకి ఒక మంచి సినిమా ప్లాన్‌ చేయమని రిక్వెస్ట్‌ చేసిందట. దిల్‌ రాజు ట్రాక్‌ రికార్డ్‌ బాగుండడంతో చైతన్య ఆ బ్యానర్లో పని చేస్తే సక్సెస్‌ కొడతాడని సమంత ఆలోచన అట. అందుకే దిల్‌ రాజుకి అతని పేరు సిఫార్సు చేసిందని, తన దగ్గర రెడీగా వున్న కథల్లో ఒకటి చైతన్యకి ఆ దర్శకుడితో నెరేషన్‌ ఇప్పించగా, అతను వెంటనే ఓకే చేసాడని సమాచారం. గతంలోనూ ‘అ ఆ’ చిత్రంలో చైతన్యని హీరోగా తీసుకోమని త్రివిక్రమ్‌ని కూడా తెగ పోరు పెట్టిందనే పుకార్లు వినిపించాయి. మ‌రి ఇప్ప‌టికైనా చైత‌న్య గాడిలో ప‌డుతాడో లేదో చూడాలి.

దిల్ రాజుకు సమంత రిక్వెస్ట్ …
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts