టాలీవుడ్ హీరో గోపీచంద్ కి యాక్సిడెంట్ !

February 18, 2019 at 1:22 pm

ప్రముఖ టాలీవుడ్ హీరో గోపీచంద్ కు గాయాలయ్యాయి. త‌న కొత్త సినిమా చిత్రీకరణలో భాగంగా బైకు పై వెళ్తుండగా స్కిడ్ అయి కింద పడ్డాడు. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా జైపూర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా బైక్ పై గోపీచంద్ వెళ్లే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అదుపుతప్ప‌డంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హీరో గోపీచంద్ కు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.01

హీరో గోపీచంద్ తాను ఎల్లప్పుడూ కూడా కథల ఎంపికలో కొత్తదనం కోరుకుంటాడు. ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్ చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరు దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా చేస్తున్నాడు. అనిల్ సుంక‌రి నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు పేరు మాత్రం ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను జైపూర్ లో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశం కావడంతో హీరో గోపీచంద్ బైకుపై వెళ్తుండగా స్కిడ్ అయింది.

టాలీవుడ్ హీరో గోపీచంద్ కి యాక్సిడెంట్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts