“యాత్ర” రివ్యూ & రేటింగ్

February 8, 2019 at 3:12 pm

టైటిల్ : యాత్ర

సంస్థ‌: 70 ఎమ్‌.ఎమ్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

న‌టీన‌టులు: మ‌మ్ముట్టి, అశ్రిత‌, జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, రావు ర‌మేష్‌, అన‌సూయ‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు

సంగీతం: కె

నిర్మాణం: శ‌శిదేవిరెడ్డి, విజ‌య్ చిల్లా

ద‌ర్శ‌క‌త్వం: మ‌హి వి.రాఘ‌వ్

బయోపిక్స్ రిలీజ్ కి ముందు ఎంత బజ్ ని తెచ్చిపెట్టగలవో ..రిలీజ్ తరువాత అంతకు రెట్టింపు పెదవి విరుపులని కూడా తెచ్చిపెడతాయి.కారణం బయోపిక్ అంటేనే అందరికి తెలిసిన జీవిత చరిత్రలు కావడంవలెనే.అందరికి తెలిసినా సెల్యూలాయిడ్ పైన ఎలా ప్రెజెంట్ చేశారా అనే కుతూహలం. వీటికి బజ్ ని క్రెయేట్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్ కి తేగలిగితే ..ప్రేక్షకుడు ఒకటి ఊహించి ..స్క్రీన్ పైన ఇంకోటి దర్సనమిస్తేనే బయోపిక్స్ భయంకరంగా ఉంటాయి.

పైనదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. యాత్ర సినిమా అస్సలు బయోపిక్ కానేకాదు.దివంగత మహానేత Y.S రాజశేఖర రెడ్డి గారి జీవితంలో జరిగిన ఒక ఘటన మాత్రమే.ఈ సబ్జెక్టు ని డీల్ చెయ్యడం బయోపిక్ ని డీల్ చెయ్యడం కంటే కూడా ఛాలెంజింగ్..ఎందుకంటే బియోపిక్స్ లో ఓ మనిషి జీవితం మొత్తాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంటుంది దాంతో సినిమాటిక్ ఈక్వేషన్స్ ని కవర్ చేయొచ్చు.అయితే ఓ మనిషి జీవితం లో చేపట్టిన పాదయాత్ర మాత్రమే సినిమాగా తీసి మెప్పించగలగటం కత్తిమీదసామే.

అందుకే ఈ సినిమా ఎలా తీసాడా అని అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసారు.దర్శకుడు మహి తాను రాసుకున్న పాదయాత్ర కథని ఎంతో నిజాయితీగా స్క్రీన్ పైన చూపించడం లో విజయం సాధించాడు.ముఖ్యంగా ఆహా..ఓహో..వీరుడు..సూరుడు..దేవుడు వైఎస్ఆర్ అని కాకుండా మనందరికీ తెలిసిన వైఎస్సార్ ని సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు.

ఈ యాత్ర సినిమాకి మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టిగారిని ఏ ముహూర్తాన ఎంచుకున్నారో కానీ అప్పుడే సినిమా సగం విజయం సాధించింది.. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి గారిని తప్ప మరొకరిని ఊహించలేము.తెరపైన ఏ ఒక్కరూ మమ్ముట్టిగారిని చూడరు..దివంగత మహానేత వైఎస్ఆర్ గారిని చూస్తున్నట్టే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.పాత్రకు మించి అభినయం చేస్తే గొప్ప నటుడంటారేమో కానీ పాత్రకు తగ్గ నటన చేస్తే మమ్ముట్టి గారిలా మహా నటుడంటారు.హాట్స్ ఆఫ్ టు మమ్ముట్టి గారు.

సినిమా విషయానికి వస్తే అసలంటూ పాదయాత్రలో రెండు గంటల పాటు చూపడానికి ఏముంటాది అనుకునే ప్రతి వారికి దర్శకుడు పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ తో సమాధానం
ఇచ్చాడు.వైఎస్ఆర్ గారి పాదయాత్ర అంటే కేవలం పదిహేను వందల కిలోమీటర్ల నడక మాత్రమే కాదు..ఓ ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం గల నాయకుడి పరివర్తన..ఓ మనిషిగా అసలు వైఎస్ఆర్ అంటే ఏంటి..వైఎస్ఆర్ గారి తదనంతర పరిపాలనకు పాదయాత్ర ఎలా బాటలువేసిందో కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మహి సక్సెస్ అయ్యాడు.

రైతులకు గిట్టుబాటు ధర,పింఛన్లు,ఆరోగ్రశ్రీ,ఫీజ్ రీఎంబెర్స్మెంట్, విద్యుత్ చార్జీల మాఫీ ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రతి సన్నివేశం పాదయాత్రలో వైఎస్ఆర్ గారు ఎలాంటి అనుభవాల మధ్య తీసుకున్నారో అద్భుతంగా ఆవిష్కరించారు.స్థూలంగా యాత్ర అంటేనేవైఎస్ఆర్ గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల సమాహారం.

దర్శకుడు ఎటువంటి భేషజాలకు పోకుండా ఎంతో నిజాయితితో సినిమాని తెరకెక్కించిన విధానం సగటు ప్రేక్షకుడిని కూడా మెప్పిస్తుంది..ఉదాహరణకు పాదయాత్ర మొదలు పెట్టేసన్నివేశం..రాజకీయాలనుంచి వైదొలుగుదాం..మా నాన్న ఆశ నెరవేరకుండానే పోతామేమో అన్న భయమేస్తోంది అని Y . S రాజశేఖర రెడ్డి గారు చెప్పడం దర్శకుడి నిజాయితీని చూపిస్తుంది.రాజా రెడ్డి గారిని రెండు మూడు సన్నివేశాల్లోనే చూపిన అవి వైఎస్ఆర్ గారి పాదయాత్రపైన ఎలా ప్రభావాన్ని చూపాయన్న దృక్పధం శెభాష్ అనిపిస్తుంది.

కాంగ్రెస్ హైకమాండ్ తో రాజశేఖర రెడ్డి గారి రిలేషన్ ..హై కమాండ్ కి Y . S రాజశేఖర రెడ్డి గారికి మధ్యన దూతల ప్రమేయం వైఎస్ఆర్ గారి రాజకీయ చతురత ఇవన్నీ పకడ్బంధీగా..మోతాదుకు మించకుండా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు.Y.S రాజశేఖర్ రెడ్డి గారు విశ్వసనీయత,విధేయత,నమ్మిన వాళ్ళ కోసం ఎంతదూరమైనావెళ్లే మనస్తత్వం,కేవీపీ గారి సన్నివేశాలు ..ఇలా ప్రతి ఒక్కటి బాలన్స్ చేసిన విధానం మెప్పిస్తుంది..మరీ ఎలాబోరేటెడ్ గా చెప్పక పోయినా చెప్పిన చిన్న డైలాగ్..చిన్న సీన్ కూడా ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది.

మార్కెట్ లో రైతు ఆత్మ హత్య,ముసలవ్వ చెప్పే చావలేక బ్రతకలేక బ్రతుకుతున్నబ్రతుకులు, హాస్పిటల్ సీన్ ,పోలీస్ స్టేషన్ సీన్ ఇలా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తూ చప్పట్లు కొట్టించే సన్నివేశాలు ఎన్నెన్నో.

మనకు తెలియని కథల్లోనే క్లైమాక్స్ మొదలవగానే ద్వారంవైపు అందరూ లేచి పరిగెత్తే రోజుల్లో..సినిమా క్లైమాక్స్ రాజశేఖర రెడ్డి గారి మరణం మనందరికీ తెలిసినా చూసేది కొత్తదేం కాకపోయినా ఒక్క ప్రేక్షకుడు కూడా కూర్చున్నచోటునుంచి లేవకపోవడం దట్ ఈజ్ వై ఎస్ ఆర్ అనిపిస్తుంది.

పాదయాత్ర తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దగ్గరనుండి మమ్ముట్టిగారిని కాకుండా నిజమైన రాజశేఖర రెడ్డిగారి పాత వీడియో బిట్స్ ని ఆడ్ చేసి చూపించడం సరికొత్త అనుభూతినిస్తుంది.చివరగా మహానేత మరణం..బ్యాక్ గ్రౌండ్ పెంచల్ దాస్ గాత్రం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తుంది.

వైస్ జగన్ ని కేవలం ఒకే ఒక సన్నివేశం లో చూపించి దర్శకుడు నేను తీసింది వైస్సార్ గారి పాదయాత్ర మాత్రమే అని అదే జగన్ గారి మాటల్లో చెప్పాలంటే మీ నాయకుడిని మీరు చూపిస్తుంటే మధ్యలో నేను ఎవరని (జగన్) అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఈ సినిమా ఏ రాజకీయ ప్రోద్బలంతోనో దురుద్దేశంతోనే చేసింది కాదని కేవలం దివంగత మహానేత వైస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం తో మాత్రమే ఎంతో నిజాయితో తీసిన సినిమా అని సగటు ప్రేక్షకుడు మెచ్చుకునే సినిమా.

అత్యద్భుతమైన సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ యాత్ర సినిమాకి సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దారు..పాటలు,బిజీ, సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్, మాటలు ఎంతగొప్పగా చెప్పినా తక్కువే.సినిమాటిక్ హై అండ్ లోస్ లాంటివి మైంటైన్ చెయ్యకవోపడం లాంటివి మినహాయిస్తే సినిమా ఆద్యంతం అద్భుతం.

బాటమ్ లైన్ : జోహార్ వైఎస్ఆర్

రేటింగ్ : 4/5

“యాత్ర” రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts