ఏపీ ఎన్నిక‌ల్లో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే…

March 20, 2019 at 1:56 pm

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పోటీ చేయ‌డం ఏమిట‌ని అనుకుంటున్నారా..? అవును ఇది నిజ‌మే.. ఆయ‌న మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ మాజీ ఎమ్మెల్యేనే.. అయితే ఈసారి మాత్రం ఏపీలో బ‌రిలోకి దిగుతున్నారు. ఇందుకూ ఓ కార‌ణం ఉందండి.. అదేమిటో తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే.. మీరు ఈ చిన్న‌పాటి క‌థ‌నం చ‌ద‌వాల్సిందేమ‌రి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఏడు మండ‌లాలు ఏపీలో క‌లిసిన విష‌యం తెలిసిందే.

ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాలు తూర్పుగోదావ‌రి జిల్లా రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిశాయి. అయితే.. గ‌తంలో భ‌ద్ర‌చాలం నియోజక‌వ‌ర్గం నుంచి సీపీఎం నేత సున్నం రాజ‌య్య వ‌రుస‌గా(2014) మూడు సార్లు గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. ఎందుకంటే.. సున్నం రాజ‌య్య సొంత గ్రామం ఉన్న మండ‌లం కూడా రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిసింది. అందుక‌నే ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భ‌ద్రాచ‌లం నుంచి పోటీ చేయలేదు.

అయితే.. ఏపీలో జ‌న‌సేన‌తో వామ‌ప‌క్షాలు పొత్తుపెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను సీపీఎం నేత సున్నం రాజ‌య్య‌కు కేటాయించారు. భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాలు రంప‌చోడ‌వ‌రంలో క‌ల‌వ‌డం.. రాజ‌య్య‌కు ఆయా మండ‌లాల్లో మంచి ప‌ట్టు ఉండ‌డంతో గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్న అంచ‌నాతో ఆయ‌న టికెట్ ఇచ్చారు. అయితే.. రంప‌చోడ‌వ‌రంలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ, సీపీఎం అభ్య‌ర్థి మ‌ధ్య త్రిముఖ పోటీ నెల‌కొంది.

ఏపీ ఎన్నిక‌ల్లో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts