ముగింపు దశలో ‘మహర్షి’!

March 12, 2019 at 3:26 pm

గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాతో మంచి విజయం అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాలేదు. ఆ మద్య ఈ మూవీకి సంబంధించి కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా రిచ్ గా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

స్టోరీ విషయానికి వస్తే..విదేశాల్లో ఉండే కోటీశ్వరు తన స్నేహితుడి కోసం భారత దేశంలో ఓ చిన్న గ్రామానికి వచ్చి అక్కడ రైతుల సమస్యలపై ఎలా పోరాటం చేస్తాడు అన్న కోణంలో ఉంటుందని ఫిలిమ్ వర్గాల టాక్. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చారు మహర్షి టీమ్.

మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. మహేష్ ప్రాణ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు.మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

ముగింపు దశలో ‘మహర్షి’!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts