జ‌గ‌న్‌ను ఢీకొన‌లేక బాబు చీప్ ట్రిక్..

March 22, 2019 at 5:04 pm

ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చంద్ర‌బాబు ఎంత‌కైనా దిగ‌జారుతారంటే ఎవ‌రూ కాద‌న‌లేని విష‌యం. గ‌తంలో ఆయ‌న రాజకీయ జీవితం చూస్తే ఈ విష‌యం ఎవ‌రికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఓట‌ర్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప‌నిలో బాబు వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏదో ఒక అన‌వ‌స‌ర విష‌యాన్ని లేక ప‌స లేని ప‌చ్చి అబ‌ద్ధాన్ని క్రియేట్ చేసి రాష్ర్ట ప్ర‌జ‌లంద‌రినీ త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్లాన్‌లు రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. జ‌గ‌న్‌కు రోజురోజుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌, ప్ర‌జ‌లు ఆయ‌నకు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్ని చూసి బెంబేలెత్తుతున్న బాబు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్ది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ర్ట సమితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావును ఇప్పుడు బ‌దునాం చేసే కార్యానికి శ్రీ‌కారం చుట్టారు బాబుగారు. ఓట‌ర్లను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి త‌న‌దైన త‌ప్పుడు ప్ర‌చారాల‌కు తెర‌లేపారు. జ‌నాల‌ను న‌మ్మించాలంటే క‌థా బ‌లం బాగా ఉండాల‌ని ఆలోచించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా విజ‌య‌వాడ గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని మ‌ధ్య‌లో పెట్టి నాట‌కం ఆడేందుకు క‌థ రచ‌న చేశారు. వంశీ ఉన్న‌ఫ‌ళంగా టీడీపీని వీడి వెంట‌నే వైసీపీలో చేరాల‌ని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు క‌ట్టు క‌థ అల్లాడు. లేక‌పోతే హైద‌రాబాద్‌లోని వంశీకి చెందిన సుమారు 50 ఎక‌రాల స్థ‌లాన్ని లాగేసుకుంటామ‌ని బెదిరించిన‌ట్టు స్ర్కిప్ట్ ర‌చించారు.

వంశీకి చెందిన స‌దురు భూమిలో తెలంగాణ స‌ర్కార్ బోర్డులు పెట్టించిన‌ట్టు లీకులిచ్చారు. వంశీ జ‌గ‌న్‌తో క‌లిసి ప‌ని చేయ‌క‌పోతే భూమిని స‌ర్కార్ భూమిగా ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌ని కేటీఆర్ హెచ్చ‌రించిన‌ట్టు క్రియేట్ చేశారు. ఇదిలా ఉండ‌గా ఇంత చేసిన బాబు అస‌లు విష‌యాన్ని మ‌ర‌చిపోయిన‌ట్టు ఉంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు. కేసీఆర్ ఇన్ని చేస్తుంటే ఆంధ్ర‌జ్యోతి రాధాక్రుష్ణ అండ్ టీం ఎందుకు ఊర‌కుంటార‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ స‌ర్కార్ నిజంగా త‌ప్పే చేస్తే చంద్ర‌బాబు అండ్ పార్టీ ఎందుకు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ఫిర్యాదు చేయ‌డం లేదో తెలుపాల‌ని అడుగుతున్నారు. ఎవ‌రైనా మోసం చేయాల‌ని చూసిన వారు ఇలాగే ఏదో ఒక సారి త‌ప్ప‌కుండా దొరికే అవ‌కాశం ఉంటుంద‌ని ఓట‌ర్లు పేర్కొంటున్నారు. పాపం బాబు గెలుపు కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు.

జ‌గ‌న్‌ను ఢీకొన‌లేక బాబు చీప్ ట్రిక్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts