అవును ఫోన్లు ట్యాప్ చేశాం : ఏపీ స‌ర్కార్

April 25, 2019 at 10:34 am

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన మాట నిజ‌మేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హైకోర్టు ముందు అంగీక‌రించింది. టెలిగ్రాఫ్ చ‌ట్టం 1885 సెక్ష‌న్ (2) కింద‌నే కొంద‌రు నేత‌ల ఫోన్లు ట్యాప్ చేసిన‌ట్టు పేర్కొంది. చ‌ట్ట‌వ్య‌తిరేకులుగా పేర్కొంటూ కొంద‌రు ప్ర‌ముఖ నాయ‌కుల పేర్లు వొడాఫోన్ కంపెనీకి ఇచ్చి ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చి ట్యాప్ చేయాల‌ని ప్ర‌భుత్వం సూచించింద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌క్రుష్ణారెడ్డి కోర్టుకు తెలియ‌జేశారు.

కేవ‌లం దేశ భ‌ద్ర‌త‌కు, స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమ‌త్యానికి భంగం క‌లిగించే సంద‌ర్భంలో, విదేశాల‌తో స్నేహ సంబంధాలు నెరిపే అవ‌కాశం ఉన్న‌ప్పుడు, నేర ప్ర‌వ్రుత్తిని కొన‌సాగిస్తు విధ్వంసం స్రుష్టించే స‌మ‌యంలో మాత్ర‌మే ఫోన్ల‌ను ట్యాప్ చేయొచ్చ‌ని టెలిగ్రాఫ్ చ‌ట్టం చెబుతుంది. ఆయా సంద‌ర్భాల్లో త‌ప్ప మ‌రే ఇత‌ర స‌మ‌యాల్లో పోన్లు ట్యాప్ చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. అయినా కూడా వైసీపీ నేత‌ల పై క‌క్ష కట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కావాల‌నే ఫోన్ ట్యాపింగ్‌ల‌కు పాల్ప‌డింద‌ని రామ‌క్రుష్ణారెడ్డి కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లారు.

త‌మ పార్టీకి చెందిన ఎవ‌రెవ‌రి ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డారో తెలుపాల‌ని కేంద్ర‌హోం శాఖ కార్య‌ద‌ర్శి, టెలిక‌మ్యూనికేష‌న్స్ కార్య‌ద‌ర్శి, వోడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడ‌ల్ ఆఫీస‌ర్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని, హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని అడ్ర‌స్ చేస్తూ కోర్టును కోరారు. అదే స‌మ‌యంలో డీజీపీ ఠాకూర్‌ను, ఇంటెలిజెన్స్ డీజీ, హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిల‌ను స‌ద‌రు చ‌ట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్రానికి ఆదేశించాల‌ని ఆయ‌న ఆయ‌న కోర్టును అభ్య‌ర్థించారు. వాద‌న‌ల‌న్నీ విన్న కోర్టు త‌మ‌కు పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌ను తెలియ‌జేస్తూ విచార‌ణ‌ను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

అవును ఫోన్లు ట్యాప్ చేశాం : ఏపీ స‌ర్కార్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts