క‌ర్నూలు సంకేతం.. దేనికి నిదర్శనం బాబూ!

April 20, 2019 at 12:38 pm

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీపై ప‌ట్టుకోల్పోతున్నారా..? ఆయ‌న మాట‌ను ప‌లువురు కీల‌క నేత‌లే ఖాత‌రు చేయ‌డం లేదా..? ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని తెలుగుత‌మ్ముళు ఓ అంచ‌నాకు వ‌చ్చారా..? అందుకే బాబుతో ఇక ప‌నేముందిలే.. అని అనుకుంటున్నారా..? అంటే క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న ఔన‌నే స‌మాధానం ఇస్తోంది. క‌ర్నూలు తెలుగు త‌మ్ముళ్లు చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. పార్టీ అధినేత వ‌స్తున్నా.. ప‌లువురు కీల‌క నేత‌ల‌తోపాటు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులు కూడా స్వాగ‌తం ప‌ల‌క‌క‌పోవ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీపై చంద్ర‌బాబు ప‌ట్టుకోల్పోతున్నారా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇంత‌కీ కర్నూలు జిల్లాలో ఏం జ‌రిగిందో ఒక‌సారి చూద్దాం… కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు, ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే.. ఇక్క‌డే ప‌లువురు తెలుగుత‌మ్ముళ్లు బాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఈ సమావేశానికి జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అఖిల ప్రియ, బుడ్డా రాజేశేఖర్‌ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత్‌, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, కేఈ ప్రతాప్ రాలేదు. పార్టీ అభ్య‌ర్థులు స‌మావేశానికి రాక‌పోవ‌డంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చేసేది ఏమీలేక‌.. సమావేశానికి వచ్చిన నాయకులనే చంద్ర‌బాబు వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు వెళ్లారు. ఈ స‌మావేశానికి హాజ‌రుకాని అభ్య‌ర్థులంద‌రూ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని.. అందుకే ఈ స‌మావేశానికి హాజ‌రుకాలేదనే టాక్ వినిపిస్తోంది. అలాగే.. తాము ఓడిపోవ‌డ‌మేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌మ‌ని, ఇక చంద్ర‌బాబు కూడా పార్టీని న‌డిపించ‌లేర‌ని, అందుకే త‌మ‌దారి తాము చూసుకోవ‌డ‌మే మేల‌నే యోచ‌న‌లో స‌ద‌రు నాయ‌కులు ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మిగ‌తా జిల్లాల‌కు వెళ్లినా బాబుగారికి ఇదే అనుభ‌వం త‌ప్ప‌ద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

క‌ర్నూలు సంకేతం.. దేనికి నిదర్శనం బాబూ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts