అంతులేని ప్ర‌శ్నః ఇప్పుడు ఓడితే.. బాబు, టీడీపీల ప‌రిస్థితి ఏంటి?

April 18, 2019 at 9:55 am

ఏపీ ఎన్నిక‌లు ముగిశాయి. కానీ, అంతులేని ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఎవ‌రు ఏపీలో ప‌గ్గాలు చేప‌డుతారు? ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు? ఎవ‌రిని ప్ర‌జ‌లు వ‌రిస్తారు? అనే ప్ర‌శ్న‌ల‌కు సమాధానం అంద‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధానంగా రెండు పార్టీలు అధికారం కోసం తీవ్ర‌స్థాయిలో పెనుగులాడాయి. వైసీపీ ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే, అధి కార టీడీపీ మ‌ళ్లీ అధికారం నిల‌బెట్టుకునేందుకు తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నించింది. సంక్షేమ ప‌థ‌కాలు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల ను ఇబ్బడి ముబ్బ‌డిగా ప్ర‌జ‌ల‌పై కురిపించింది. ప‌సుపు-కుంకుమ పేరుతో ఎన్నిక‌లకు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బా బు చేసిన ప్ర‌యోగం దేశ చ‌రిత్ర‌లోనే పెను సంచ‌ల‌నం.

ఎన్నిక‌ల‌కు ఒక్క‌రోజు ముందు వ‌ర‌కు కూడా ప్ర‌భుత్వం నుంచి న‌గ‌దు రూపంలో ఫ‌లాలు అందించిన చ‌రిత్ర ఆయ‌న‌కే ద‌క్కింది. ఆఖ‌రుకు అత్యంత ప‌టిష్టంగా ఉండే ఎన్నిక‌ల సంఘం కూడా దీనిని నిలువ‌రించ‌లేక పోయింది. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన శైలికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. రెండు చేతులు గాలిలోకి తిప్పుతూ.. త‌న హావ భావాల‌ను ప్ర‌ద‌ర్శించారు. దీనికిమించి రాష్ట్ర చ‌రిత్ర‌లోనే తొలిసారి ఆయ‌న వంగి వంగి ప్ర‌జ‌ల‌కు విన‌య‌పూర్వ‌క వంద‌నాలు స‌మ‌ర్పించారు. స‌రే.. ఇదంతా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను మచ్చిక చేసుకునేందుకు బాబు చేసిన ప్ర‌యోగంగానే భావించ‌వొచ్చు. ఇక‌, దీని ఫ‌లితం ఏంట‌నేది.. మే 23 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్ర‌బాబుకు ఇప్పుడు అధికారం కోసం ఇంత‌గా త‌పించాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ది? ఈ ప్ర‌శ్న‌కు అనేక స‌మాధానాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక‌టిదీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సూత్రాన్ని బాబు అనుస‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌య‌సు అటు ఇటుగా 70కి చేరింది. ఈద‌ఫా ఆయ‌న అధికారంలోకి వ‌చ్చి.. సీఎం పోస్టును త‌న కుమారుడికి(చివ‌రి రెండేళ్లు) ఇవ్వాల‌నేది ఆయ‌న ప్ర‌ధాన సంక‌ల్పంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మంత్రిగా రెండేళ్ల‌పాటు లోకేష్ అనుభ‌వం గ‌డించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కుడిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

అదేస‌మ‌యంలో తాను జీవించి ఉన్న స‌మ‌యంలోనే టీడీపీకి లోకేష్‌ను కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిని అధికారిక హోదా లోనే చేయాల‌ని బాబు భావిస్తున్నారు. వాస్త‌వానికి ఈప‌దవిని అప్ప‌గించేందుకు రాష్ట్రంలో అధికారం అక్క‌ర్లేదు. కానీ, అధికారంలో ఉండి పార్టీని అప్ప‌గిస్తే.. ఎలాంటి త‌ల‌నొప్పులు లేకుండా ఉంటాయ‌ని బాబు భావిస్తున్నారు. ఒక వేళ ఇదిజ‌ర‌గ‌క‌పోతే.. టీడీపీని ఎన్టీఆర్ వార‌సులుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ కానీ, హ‌రికృష్ణ త‌న‌యులు కూడా చేప‌డితే ప‌రిస్థితి మారిపోతుంది. పైగా అనుకున్న స్థాయిలో లోకేష్ ప్ర‌జాద‌ర‌ణ‌ను చూర‌గొన‌లేదు. ఈ రెండు ప్ర‌ధాన కార‌ణాల నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు మ‌రోసారి ప‌ద‌వికోసం పాకులాడుతున్నార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో గ‌డిచిన ఐదేళ్ల‌లో త‌న వ‌ర్గం వారికి చంద్ర‌బాబు చేసుకున్న మేళ్లు.. చిర‌స్థాయిగా వారికి అందాలంటే.. ఈ ద‌ఫా అధికారంలోకి రావాల్సిన అగ‌త్యం ఎంతైనా ఉంద‌న్న‌ది మేధావుల మాట‌. మొత్తానికి ఈ కార‌ణాల‌తోనే చంద్ర‌బాబు చెమ‌టోడ్చాడ‌ని అంటున్నారు.

అంతులేని ప్ర‌శ్నః ఇప్పుడు ఓడితే.. బాబు, టీడీపీల ప‌రిస్థితి ఏంటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts