మేధావుల మాట‌: బాబు క‌న్నా జ‌గ‌న్ బెట‌ర్‌!

April 17, 2019 at 4:49 pm

సాధార‌ణంగా మేధావులు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వారు కూడా రాజ‌కీయాల గురిం చి చ‌ర్చిస్తున్నారు. నిర్మొహ‌మాటంగానే మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ రాజ‌కీయాల‌పై మేధావులు సైతం పెద‌వి విప్పుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందున్న ప‌రిణామాలు, ఎన్నిక‌ల‌కు త‌ర్వాత ప‌రిణామాల‌పై వారు త‌మ‌దైన శైలిలో విశ్లేష ణ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ల వ్య‌వ‌హార శైలిపై మేధావులు త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. న‌ల‌భై సంవ‌త్స‌రాల సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం త‌న సొంత మ‌ని చెబుతున్న చంద్ర‌బాబుకు, 2004లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన జ‌గ‌న్‌కు మ‌ధ్య తేడాను వారు వివ‌రిస్తున్నారు.

ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత ప‌రిస్థితిపై మాట్లాడుతూ.. ఇలాంటి సీఎంను తాము గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లే దనే వారి సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో అక్క‌డ అధికార పార్టీతో జ‌ట్టుక‌ట్టేందుకు ఉవ్విళ్లూరిన చంద్ర‌బాబుకు అప్పుడు అది ప‌రాయి రాష్ట్ర‌మ‌ని, మ‌న పోల‌వ‌రం నిర్మాణానికి అడ్డుతగులుతున్న రాష్ట్ర‌మ‌ని గుర్తులేదా? అనేది ఒక ప్ర‌శ్న అయితే… నాలుగున్నరేళ్ల‌కు పైగానే బీజేపీతో అంట‌కాగిన చంద్ర‌బాబుకు ఆ పార్టీ ఏపీకి ఏమీ చేయ‌ని విష‌యం అప్పుడు మ‌రిచిపోయారా? అనేది మ‌రో ప్ర‌ధాన అంశంగా పేర్కొంటున్నారు. రాజ‌కీయంగా అభివృద్ధి త‌న నినాద‌న‌మ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల్లో అభివృద్ధి అనేక ప‌దాన్ని మ‌రో కోణంలో చూపించార‌ని అంటున్నారు.

నిజానికి గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో ఏపీలో అభివృద్ది జ‌రిగి ఉంటే.. చంద్ర‌బాబు వంగి వంగి మ‌రీ ప్ర‌జ‌ల‌కు ద‌ణ్నా లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏముంటుంది? ఇక‌, ఐదేళ్ల కాలంలో విప‌రీత‌మైన వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల ను కూడా వెనుకేసుకు వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే స‌రికి ఇక‌పై ఎమ్మెల్యేల‌ను లైన్‌లో పెడ‌తాన‌ని, త‌న‌నుచూసి ఓటేయ‌మ‌ని అర్ధించ‌డం వెనుక ఆయ‌న వారి త‌ప్పుల‌ను ఒప్పుకొన్న‌ట్టేనా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, ఎన్నిక లకు నాలుగు మాసాల ముందు నుంచి అమ‌లు చేసిన ప‌థ‌కాలు కూడా జ‌గ‌న్ చెప్పిన న‌వ‌రత్నాల నుంచే కాపీ చేశార‌నే వాద‌న‌ను మేధావులు సైతం తెరమీదికి తెస్తున్నారు.

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఎక్క‌డా ఇలాంటి దిగ‌జారుడు రాజ‌కీయం చేక‌పోవ‌డం ఒకింత ఆయ‌న‌కు మేలు చేసింద‌ని అంటున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కానీ, సంక్షేమం విష‌యంలో కానీ జ‌గ‌న్ అనుస‌రించిన వైఖ‌రి ఆది నుంచి ఒకే విధంగా ఉంద‌ని వారు చెబుతున్నారు. రాజ‌కీయంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం అనేది స‌మీక‌ర‌ణ‌ల్లో భాగ‌మే త‌ప్ప‌.. మ‌రోటి కాద‌ని అంటున్నారు. ఇక‌, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘంపై లేవ‌నెత్తిన సందేహాలు ప‌స‌లేకుండా పోయాయి. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకుపెద్ద‌గా ఎవ‌రూ ముందుకు రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. వీటికితోడు మ‌మ‌తా బెన‌ర్జీ వంటివారు ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తే..వారికే త‌మ మ‌ద్ద‌తు అన్న‌ట్టుగా రాజ‌కీయాలు చేస్తుండ‌డం కూడా బాబుకు మైన‌స్సేన‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు జ‌గ‌నే బెటర్ అనే సంకేతాలు పంపాయ‌ని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉన్నా.. బాబు వైఖ‌రిపై మాత్రం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపించింద‌ని చెబుతున్నారు.

మేధావుల మాట‌: బాబు క‌న్నా జ‌గ‌న్ బెట‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts