చింత‌మ‌నేనిలో గుబులు.. రీజ‌న్ ఓట‌మేనా…!

April 17, 2019 at 10:38 am

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర‌మైన గుంభ‌నం క‌నిపిస్తోంది. లోలోప‌ల మ‌ధ‌న ప‌డుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకున్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ కూడా గుబులుగా ఫీల‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వాస్త‌వానికి చింత‌మ‌నేని అంటేనే నిత్యం ఎంతో చురుగ్గా, చ‌లాకీగా ఉండే నేత‌గా గుర్తింపుసాధించారు. ఆయ‌న ఎక్క‌డ ఏ వ్యాఖ్య‌లు చేసినా సంచ‌ల‌న‌మే అవుతుంది. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. అదేస‌మ యంలో ఆయ‌న ప‌రివారం కూడా మౌనం వ‌హించారు. ఎక్క‌డికక్క‌డ టీడీపీ శిబిరంలో నిరాశ క‌నిపిస్తోంది.

దీనికి కార‌ణం.. ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు వ‌రుస విజ‌యాలు కైవసం చేసుకున్న చింత‌మ‌నేని.. మూడో సారి హ్యాట్రిక్ దిశ‌గా దూసుకుపోతున్నారు. అయితే, చింత‌మ నేనికి చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇక్క‌డ నుంచి ఎన్నారై కొఠారు అబ్బ‌య్య చౌద‌రిని రంగం లోకి దింపారు. దాదాపు ఏడాదిన్న‌ర కింద‌ట నుంచే కొఠారునియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లు పుకొని పోయారు. యువ‌త‌ను ప్ర‌ధానంగా త‌న‌వైపు తిప్పుకొన్నారు. దీంతో కొఠారు హ‌వా పెరిగిపోయింది. ఇదే స‌మయంలో చింత‌మేనేని వ్య‌వ‌హార‌శైలి తీవ్ర వివాదాస్ప‌దంగా మారిపోయింది.

మ‌రీముఖ్యంగా ఎస్సీల‌పై చింత‌మ‌నేని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర‌స్థాయిలో అటు పార్టీని, ఇటు వ్య‌క్తిగ‌తంగా చింత‌మ‌నేనిని కూడా డ్యామేజీ చేసింది. దీంతో ఎస్సీ వ‌ర్గాలు కూడా ఆయ‌న‌కు దూర‌మ‌య్యారు. అదేస‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గంలోనే చిం త‌మ‌నేనిని వ్య‌తిరేకించే వారు పెరిగిపోయారు. వీరు కూడా లోపాయికారీగా కొఠారుకు కొమ్ముకాశార‌ని అంటున్నారు. ఇన్ని ప‌రిణామాల‌తో పాటు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా ఇక్క‌డ ప‌నిచేసింది. మొత్తానికి చింత‌మ‌నేని గెలుపుపై ఈ ప‌రిణామాలు ప్రభావం చూపుతాయ‌ని అంటున్నారు. ఇరు ప‌క్షాలు కూడా క‌మ్మ వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను రంగంలోకి దింప‌డంతో పోటీ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో చింత‌మ‌నేని గెలుపు అంత ఈజీకాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యం లోనే చింత‌మ‌నేని సైలెంట్ అయ్యార‌ని, గుంభ‌నంగా ఉన్నార‌ని అంటున్నారు.

చింత‌మ‌నేనిలో గుబులు.. రీజ‌న్ ఓట‌మేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts