తేడా వ‌స్తే మొద‌టికే మోసం..దేవినేని!

April 20, 2019 at 3:12 pm

అధినేత మెప్పుకోస‌మో, మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించ‌డానికో నోటికేది వ‌స్తే అది మాట్లాడితే ఆ త‌ర్వాత ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. తుఫాన్ ముందు ప్ర‌శాంత‌త‌గా, గెలుపు ముందు మౌనంగా ఉన్న జ‌గ‌న్‌పై ప్ర‌స్తుత మంత్రి దేవినేని చేస్తుంది అదే అనిపిస్తోంది. చంద్ర‌బాబు అండ్ టీంలో కాస్తోకూస్తో మాట్లాడేది అంటే అది ముమ్మాటికి దేవినేనే.. అందులో ఎలాంటి అనుమానాలు అక్క‌ర లేదు. కానీ ఆ మాట‌లే రేప్పొద్దున తూట‌లుగా మారి రివ‌ర్స్ వ‌చ్చి త‌గిలే ప‌రిస్థితిని ఏ మాత్రం బేరీజు వేసుకోకుండా వ‌ద‌ల‌డ‌మే ఆయ‌న చేస్తున్న తెలివి త‌క్కువ త‌నంగా చెప్పొచ్చు.

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారిన జ‌గ‌న్ సీఎం అనే నేమ్ ప్లేట్‌పై దేవినేని ప్ర‌తీ సంద‌ర్భంలోనూ నోరు పారేసుకుంటున్నారు. రూ.300 కోట్లు ఖ‌ర్చుపెట్టి చేయించుకున్నారని, వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ చివ‌ర‌కు జ‌గ‌న్‌కు అదొక్క‌టే చేతిలోపెట్ట‌బోతున్నార‌ని నోటికెంతోస్తే అంత మాట్లాడేస్తున్నారు. ఆ నేమ్ ప్లేట్ నిజ‌మా.. మార్ఫింగా అనేది ఇంకా తేల‌నే లేదు కానీ, దానిని ఓ అవ‌కాశంగా తీసుకున్న టీడీపీ నేత‌లు వ్యంగ్యాస్ర్తాలు మాత్రం వ‌దులుతూనే ఉన్నారు. ఇంత‌గా ప్ర‌చారం చేసుకున్న జ‌గ‌న్‌కు మిగిలేది ఆ ఒక్క నేమ్ ప్లేటే అని పైశాచికానందం పొందుతున్నారు.

కానీ, ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి ఇంకా నెల రోజుల స‌మ‌యం ఉంది. రాష్ర్టంలోని ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ వెంటే ఉన్నార‌నే స‌ర్వేలు చెబుతున్నాయి. దేశ‌మొత్తంగా ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌పైనే ఆధార‌ప‌డిందా అన్నంత‌గా అంతా ఇటే చూస్తున్నారు. అందునా జ‌గ‌న్ కాబోయే సీఎం అని జాతీయ పార్టీ నేత‌లు కూడా ఓ అంచాన‌కు వ‌చ్చారు. ఇలాంటి స‌మ‌యంలో రేపొద్దున ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత దేవినేని త‌న త‌ల‌ను ఎక్క‌డ పెట్టుకుంటారో..? ప‌్ర‌తిప‌క్ష హోదాలో కూర్చునే అధినేత చంద్ర‌బాబు ప‌క్క‌నే ఉండాల్సిన నేత అడ్డ‌మైన వాగుడుకు పోయి ఆయాస‌ప‌డుతున్నార‌ని తేలిపోతోంది. అంతే కాకుండా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పాత త‌ప్పుల‌కు స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంద‌నే క‌నీసం ధ‌ర్మాన్ని ఎందుకు మిస్ అవుతున్నారో కూడా దేవినేనికి తెలియ‌క‌పోవ‌డం బాధాక‌రం. పాపం దేవినేని.. బాబు మెప్పు కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు.

తేడా వ‌స్తే మొద‌టికే మోసం..దేవినేని!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts