హరీష్ రావును సాగనంపటం ఖాయమేనా!

April 25, 2019 at 10:54 am

తెలంగాణ రాష్ర్ట స‌మితి ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి పూర్తిగా పార్టీ కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మైన హ‌రీష్‌రావు కొంత‌కాలంగా అసంత్రుప్తిగా ఉన్న‌ట్టు తెలిసిపోతోంది. కావాల‌నే సీఎం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్ద‌రూ క‌లిసి వేరేపెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి. చాలాసార్లు అనుమానం వ‌చ్చినా హ‌రీశ్‌రావు ఎప్పుడూ ఆ విష‌యాన్ని కొట్టిపారేస్తూనే ఉన్నారు. తాను ఎప్పుడూ పార్టీని వీడే అవ‌కాశ‌మే లేద‌ని, చావైనా, బ‌తుకైనా పార్టీలోనే అని హ‌రీశ్ సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారి పేర్కొంటూనే ఉన్నారు.

అయితే తాజాగా కేసీఆర్ సోద‌రుడి కుమార్తె ర‌మ్య‌రావు తాజాగా ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే హ‌రీశ్‌రావును పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపే కార్య‌క్ర‌మానికి ఆజ్యం ప‌డ‌నుంద‌ని పేర్కొంది. గ‌తంలో పార్టీ నిర్ణ‌యాలు, విధివిధానాలు ఖ‌రారు చేసే స‌మ‌యంలో హ‌రీశ్ ఆలోచ‌న‌ల‌కు విలువ ఇచ్చే సీఎం కేసీఆర్ ఇప్పుడు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె అన్నారు.

కొంత కాలంగా కేటీఆర్‌కు పార్టీలో అగ్ర‌తాంబూలం ఇస్తూ పార్టీ పగ్గాలు ఆయ‌న‌కే క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆమె చెప్పారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే హ‌రీశ్‌రావును కావాల‌నే దూరం పెడుతున్న స‌మీక‌ర‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆమె అన్నారు. పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు గెలుపును ఒంటి చేత్తో అందించిన హ‌రీశ్‌ను ఇప్పుడు అంటీ ముట్ట‌న్న‌ట్టు ఉంచ‌డం చూస్తుంటే పొమ్మ‌న‌లేక పొగ‌పెడుతున్న‌ట్టు తేలిపోయింద‌ని ర‌మ్య‌రావు తెలియ‌జేస్తున్నారు. రాబోయే కాలంలో టీఆర్ ఎస్‌లో జ‌రిగే ప‌రిణామాలు ర‌స‌వత్త‌రంగా మార‌బోతున్నాయ‌ని ఆమె పేర్కొన్నారు.

హరీష్ రావును సాగనంపటం ఖాయమేనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts