జ‌న‌సేన పార్టీ మొదటి దుకాణం బంద్..!?

April 18, 2019 at 12:37 pm

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం ఏమీ లేద‌ని తేలిపోయింది. అస‌లు ప‌వ‌న్ కూడా గెలుస్తాడో లేదోన‌న్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లో క‌లుగుతున్నాయి. పోలింగ్ ముగిసిన త‌ర్వాత ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ మీడియా ముందుకు రాలేదు. ఇలాంటి నిరాశాజ‌న‌క ప‌రిస్థితుల్లో జ‌న‌సేన‌ ఐటీ విభాగం దుకాణం కూడా దాదాపుగా బంద్ అయింది. అధినేతే ఆగ‌మాగం ఉన్నాడు.. ఇక ఐటీ సెంట‌ర్‌తో ప‌నేముంద‌ని అనుకున్నారేమోగానీ పెద్ద‌సంఖ్య‌లో అందులోని ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా ఐటీ సెంట‌ర్‌ను ప్రారంభంచి, సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేశారు.

రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతుస్తుల‌ భవనాన్ని అద్దెకు తీసుకుని జ‌న‌సేన ఐటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 500మందికిపైగా ఉద్యోగుల‌ను తీసుకున్నారు. ఈ సెంట‌ర్‌ను పార్టీ అధినేత‌ పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఈ సెంట‌ర్‌ను బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఎన్నికల్లో వీరంద‌రినీ ఎడాపెడా వాడుకున్నారు. ప‌వ‌న్ డైలాగ్స్ దంచికొడుతుండ‌గా.. అందుకు అనుగుణంగా సోష‌ల్ మీడియాలోనూ హ‌డావుడి చేశారు. కానీ..ఏం లాభం. ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ స‌ర‌ళితో జ‌న‌సేన ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని తేలిపోయింది. ఒక‌టి రెండు సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌నే అంచ‌నాకు వ‌చ్చారు.

అయితే.. అయితే.. ఇలా ఎన్నిక‌లు ముగిశాయో లేదో.. ఇక మీ సేవ‌లు అవ‌స‌రం లేదంటూ తీసేశారు. ఇప్పుడు వారంతా కూడా కొత్త ఉద్యోగాలు వెతుక్కునే ప‌నిలో ప‌డ్డారు. 500మందిలో దాదాపు 350 మందిని విధుల్లోంచి తొలగించారు. ఇక ఆ మూడు అంత‌స్తుల‌ భవనంలో ఒక అంతస్తును మాత్రమే ఐటీ సెంట‌ర్‌కు కేటాయించి, మిగతా రెండింటిని జనసేన ఖాళీ చేసింది. ఇంకేముంది.. ఆ రెండు అంత‌స్తుల‌కు టు-లెట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే.. రానున్నముందు ముందు 100 మందికిపైగా ఉద్యోగులతోనే ఐటీ సెంటర్‌ నిర్వహించాలని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఐటీ సెంట‌ర్‌లో ఉద్యోగుల‌ను తీసేసిన ప‌వ‌న్‌కు.. ప్ర‌జ‌లు ప్ర‌జాప్ర‌తినిధిగా ఉద్యోగం ఇచ్చారో లేదో తెలియాలంటే మే 23వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

జ‌న‌సేన పార్టీ మొదటి దుకాణం బంద్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts