ఇంటి పోరు ఎఫెక్ట్..జవహర్ ఓటమి ఖరారు !

April 18, 2019 at 6:00 pm

మంత్రి జ‌వ‌హ‌ర్‌. అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌గా గుర్తింపు పొందిన నాయ‌కుడిగా, మంత్రిగా ఆయ‌న రికార్డు సృష్టిం చారు. ముఖ్యంగా ద‌ళిత వ‌ర్గానికి చెందిన నాయ‌కుల్లో ఆయ‌న ఐకాన్‌గా కూడా మారిన సంద‌ర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా ఆ పార్టీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్ ఇవ్వ‌డంలో జ‌వ‌హ‌ర్ స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామం ఆయ‌నకు ఎన‌లేని గుర్తింపు తెచ్చింది. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే.. చంద్ర‌బాబుకు వీర విధేయుడిగా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు. బాబు గెలుపు కోసం, బాబు మ‌రోసారి సీఎం అయ్యేందుకు 120 కిలోమీట‌ర్ల దూరం కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేసి ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

అయితే, తాను ప్రాతినిథ్యం వ‌హించిన కొవ్వూరు నియోజ‌వ‌క‌ర్గంలో టీడీపీ శ్రేణుల నుంచే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను మూట గ‌ట్టుకున్నారు. అక్క‌డి నాయ‌కులు జ‌వ‌హ‌ర్ కు టికెట్ ఇవ్వొద్ద‌ని రోడ్డు ఎక్కే ప‌రిస్థితిని ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. జ‌వహ ర్ నిలువ‌రించలేక పోయారు. ఈ క్ర‌మంలోనే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కృష్ణా జిల్లాలోని తిరువూరు నుంచి తాజా ఎన్ని క‌ల్లో పోటీ చేశారు. అయితే, ఇక్క‌డ కూడా ఇంటిపోరు త‌ప్ప‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ముఖ్యంగా వీర‌భ‌ద్ర‌స్వామి ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు. అయితే, చివ‌రి నిముషం వ‌ర‌కు ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌ని అనుకున్న టికెట్ చివ‌రికి జ‌వ‌హ‌ర్ వ‌శమైంది. దీంతో తీవ్ర‌స్థాయిలో ఆయ‌న వేద‌న కు గుర‌య్యారు. విష‌యాన్ని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. కాయ‌క‌ల్ప చికిత్స చేసినా.. లోపాయికారీగా మాత్రం బాబు ప్ర‌య‌త్నాలు ఎఫెక్ట్ అయ్యాయి.

ఇక్క‌డ, టీడీపీ శ్రేణులు పెద్ద‌గా జ‌వ‌హ‌ర్‌కు క‌లిసి రాలేదు. ఎన్నిక‌లు అయ్యాక ప్ర‌చారంపై నిర్వ‌హించిన తాజా స‌మీక్ష‌లో జ‌వ‌హ‌ర్‌కు అస‌లు విష‌యం బోధ‌ప‌డింది. కొవ్వూరులో త‌న‌ను వ్య‌తిరేకించిన శ్రేణులు రోడ్డుమీద‌కి వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డంతో ఎవ‌రెవ‌రు త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నారో తెలిసిపోయింది. అయితే, తిరువూరులో మాత్రం ఎవ‌రూ కూడా పైకి ఆందోళ‌న చేయ‌కుండా లోపాయికారీగా జ‌వ‌హ‌ర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశార‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మైంది. నిధుల విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డం, ప్ర‌చారంలో పాల్గొన్న వారికి కూడా నాలుగు మంచి మాట‌లు చెప్పి త‌ప్పించుకోవ‌డం వంటి ప‌రిణామాలు జ‌వ‌హ‌ర్‌కు ఇబ్బంది క‌లిగించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో జ‌వ‌హ‌ర్‌కు గెలుపు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

ఇంటి పోరు ఎఫెక్ట్..జవహర్ ఓటమి ఖరారు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts