జ‌న‌సేనకు షాక్‌..ఓట‌మిని ఒప్పుకొన్న జేడీ !

April 18, 2019 at 5:33 pm

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందుగానే జ‌న‌సేన‌లో ఓట‌మి బాంబులు పేలుతున్నాయి. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా అబ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. కీల‌క‌మైన స్థానాల్లో కీల‌క‌మైన నేత‌ల‌కే అవ‌కాశం క‌ల్పించారు. ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తున్నాం.. అనే దానిక‌న్నా కూడా.. ఎన్నిస్థానాల్లో గెలుపు గుర్రం ఎ క్కుతాం.. అనే రేంజ్‌లోనే ఆలోచించి దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్నీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నే తీసుకుని ముందుకు సాగారు. ఆచితూచి అడుగులు వేశారు. సామాజిక వ‌ర్గాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల్లో మంచి త‌నం సంపాయించుకున్న నేత‌ల‌కు ప‌వ‌న్ ఛాన్స్ ఇచ్చారు.

ఇలాంటి వారిలో విశాఖ ఎంపీగా పోటీ చేసిన జ‌న‌సేన అభ్య‌ర్థి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఉర‌ఫ్ మాజీ జేడీని కూడా ప‌వ‌న్ ప్ర‌తి ష్టాత్మ‌కంగానే భావించారు. సీనియార్టీ, సిన్సియార్టీ, నిజాయితీ వంటివి ఇక్క‌డ ప‌నిచేస్తాయ‌ని, ముఖ్యంగా మేదావి వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డం క‌లిసి వ‌స్తుంద‌ని భావించిన ప‌వ‌న్‌.. దీనికి అనుగుణంగానే వీవీని విశాఖ ఎంపీగా పోటీ చేయించారు. తాను స్వ‌యంగా రెండు సార్లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇక‌, వీవీ కూడా సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఉండ‌డానే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, క్లాస్ పీపుల్‌ను ఆయ‌న ఆక‌ట్టుకోగ‌లిగినా.. మాస్ జనాల‌కు మాత్రం వీవీ చేరువ కాలేక పోయారు. ఆయ‌న‌ను ఇప్ప‌టికీ ఓ ఆఫీస‌ర్‌గానే చూస్తున్నారు.

ఇక‌, విశాఖ‌లో చ‌తుర్ముఖ పోటీ పెరిగిపోయింది. బీజేపీ నుంచి పురందేశ్వ‌రి, టీడీపీ నుంచి ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వ‌డు, బాల‌య్య అల్లుడు శ్రీభ‌ర‌త్‌, వైసీపీ నుంచి పారిశ్రామిక వేత్త ఎంవీవీ సత్యానారాయ‌ణ‌లు పోటీ చేశారు. దీంతో పోటీ తీవ్రంగానే సాగింది.దీంతో ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా సంచ‌ల‌నంగానే మారింది. కానీ, జ‌న‌సేన అభ్య‌ర్థిగా పోటీ చేసిన వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ మొద‌ట్లో త‌న గెలుపుపై కొంత‌మేర‌కు ధీమాగానే ఉన్న‌ప్ప‌టికీ.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఆశ‌లు వదిలేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాజాగాఆయ‌న వ్యాఖ్యానిస్తూ. `గెలవకపోతే` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఇప్ప‌టి వ‌రకు ఓట‌మి అంచున ఉన్న నాయ‌కులు కూడా ఎవ‌రూ ఇలా వ్యాఖ్యానించ‌లేదు. కానీ, వీవీ ఇలా ముందుగానే సందేహం వ్య‌క్తం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే మే 23 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

జ‌న‌సేనకు షాక్‌..ఓట‌మిని ఒప్పుకొన్న జేడీ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts