**ప‌చ్చ‌**పొర‌ల ల‌గ‌డ‌పాటి స‌ర్వే..!

April 18, 2019 at 12:03 pm

స‌ర్వేలు అంటే అంచనాల‌కు కొంచెం అటూ ఇటుగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు చేరువ‌లా ఉండాలి. ప్ర‌జా తీర్పును య‌థావిధిగా చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు కానీ కొంచెంలో కొంచెమైనా వారి తీర్పుకు దరిదాపుల్లోనైనా ఉండాలి. కానీ సొంత పైథ్యాన్ని రుద్దుతూ స‌ర్వేలు విడుద‌ల చేస్తే విలువలు ఉండ‌వు. ఎవ‌రి కోస‌మే, కొంద‌రి స్వ‌లాభాల కోస‌మో మ‌నకున్న పేరును తుడిచిపెట్టుకుపోయేలా తాత్కాలిక స‌ర్వేలు ఇవ్వ‌డం పాపం ల‌గ‌డ‌పాటి వంటి వారికే సాధ్యం. ఒకప్పుడు ల‌గ‌డ‌పాటి వారి స‌ర్వే అంటే కాస్తో కూస్తో విలువుండేది. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

మొన్న‌టికి మొన్న తెలంగాణ రాష్ర్టంలో జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి వారు త‌న స‌ర్వేను అట్ట‌హాసంగా విడుద‌ల చేశారు. ఎల్లో మీడియా క‌ను స‌న్న‌ల్లో, ప‌చ్చ పార్టీ అధినేత ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌ది కాని స‌ర్వేను త‌న‌దైన‌ట్టు విడుద‌ల చేశారు. పాపం ఆయ‌న గారి స‌ర్వేను కుప్ప‌తొట్లో వేసినా ప‌నికి రాకుండా పోయింది. ఆ స‌ర్వే ఫ‌లితాలు ల‌గ‌డ‌పాటి గారికి అంతో ఇంతో ఉన్న పేరును పూర్తిగా చెరిపేసింది. ఆంధ్ర‌జ్యోతి రాధాక్రుష్ణ‌కు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌గా ఉండే ఫ‌లితాలు విడుద‌ల చేసి ఇవి నిజ‌మైన రిజ‌ల్ట్స్ అంటూ ఊద‌ర‌గొట్టిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు నిజ‌మైన తీర్పు మ‌తి పోగొట్టేలా చేసింది.

ఇప్పుడు ఏపీలో కూడా మ‌ళ్లీ త‌నదైన మోస‌పు ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే అన్ని స‌ర్వేలు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీ వ‌స్తుంద‌ని తేల్చేసినా పాపం రాజ‌గోపాలుడు మాత్రం మ‌ళ్లీ బాబు కోసం త‌న‌దైన పంతాకు భిన్నంగా మ‌రోమారు స‌ర్వేను విడుద‌ల చేశారు. పచ్చ‌మీడియాకు అనుకూలంగా, చంద్ర‌బాబుకు లేని ద‌ర్పం వెల‌గ‌బెట్టేలా త‌న దైన స‌ర్వే రిపోర్టును వండి వ‌డ్డించారు. ప్ర‌జ‌లంద‌రిదీ ఒక దారైతే త‌న‌ది అందుకు భిన్న‌మ‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పాపం ఇటు రాధ్రాక్రుష్ణ‌కు, అటు చంద్ర‌బాబుకు అనుకూలంగా చేయ‌లేక ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు మ‌న ల‌గ‌డ‌పాటి గారు.

**ప‌చ్చ‌**పొర‌ల ల‌గ‌డ‌పాటి స‌ర్వే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts