మ‌హేశ్ కెరీర్‌లోనే ఇదే బెస్ట్‌..!

April 2, 2019 at 2:07 pm

భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత టాలీవుడ్ టాప్ హీరో మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి. ఇది ఆయ‌న‌కు 25వ చిత్రం. అందుకే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా దీనిని తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఇక మ‌హేశ్‌కు జోడిగా పూజాహెగ్డె న‌టిస్తోంది. అలాగే.. అల్ల‌రి న‌రేశ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అయితే.. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు దీనికి సంబంధించిన ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప‌డేట్ వ‌స్తూనే ఉంది. తాజాగా.. మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ఇం డ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

అదేమిటంటే.. ఈ మ‌ధ్య వ‌స్తున్న సినిమాలు విడుద‌ల‌కు ముందే మంచి బిజినెస్ చేస్తున్నాయి. కాలం క‌లిసి వ‌స్తే.. స‌గం బ‌డ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న మ‌హర్షి సినిమా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమేజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నట్టుగా ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇది తెలుగులో మ‌హేశ్ క్రేజ్‌ను తెలియ‌జేస్తుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి.

భ‌ర‌త్ అనే నేను సినిమా భారీ హిట్ అందుకోవ‌డం.. ఆ త‌ర్వాత మ‌హేశ్ న‌టిస్తున్న సినిమా మ‌హ‌ర్షి కావ‌డంతో అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అమేజాన్ ప్రైమ్‌ దాదాపు 11 కోట్ల రూపాయ‌లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. ఇది మహేశ్‌ బాబు కెరీర్‌లోనే ది బెస్ట్ అని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు దీనిపై చిత్ర‌యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా, మే 9న మ‌హ‌ర్షి సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ క‌స‌ర‌త్తు చేస్తోంది.

మ‌హేశ్ కెరీర్‌లోనే ఇదే బెస్ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts