మ‌జిలీ సినిమా రివ్యూ.. నాగచైతన్యకు హిట్టొచ్చిందోచ్

April 5, 2019 at 2:55 pm

మ‌జిలీ సినిమా రివ్యూ..

చిత్రం : మజిలీ
న‌టీన‌టులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్‌, రావూ రమేష్‌
సంగీతం : గోపి సుందర్‌
నేపథ్య సంగీతం : తమన్‌
దర్శకత్వం : శివా నిర్వాణ
నిర్మాత : సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది

మాస్ ఇమేజ్ కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేసినా నాగ‌చైత‌న్య స‌క్సెస్ కాలేక‌పోయాడు. చివ‌ర‌కు బాగా క‌లిసొచ్చిన రొమాంటిక్‌ ప్రేమ‌క‌థ‌ల‌నే న‌మ్ముకుని ముందుకు వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో శివా నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. ఈ సినిమా ట్రైల‌ర్లు, పాట‌ల‌తో అంచ‌నాలు భాగా పెరిగాయి. తాజాగా శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఏం మాయ చేసావె సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన చైతూ, స‌మంత‌.. రియ‌ల్‌లైఫ్‌లో న‌టించిన మొద‌టి సినిమా మ‌జిలి. ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న త‌ర్వాత న‌టించిన మొద‌టి చిత్రం కావ‌డంతో ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లోనూ ఉంది.

క‌థేమిటంటే..
పూర్ణ (నాగచైతన్య) ఐటీఐ విద్యార్థి. చదువుతూనే ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా చోటు ద‌క్కించుకోవాల‌న్న‌ది ఆయ‌న గోల్‌. ఇందుకోసం బాగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో జ‌రిగిన ఓ గొడ‌వ కార‌ణంగా ఆయ‌న‌కు అన్షు (దివ్యాంశ కౌశిక్‌) ప‌రిచ‌య‌మై ప్రేమలో పడతాడు. అయితే.. వారి పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోరు. దివ్యాంశ‌ను ఆమె త‌ల్లిదండ్రులు దూరంగా తీసుకెళ్తారు. దీంతో తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గురైన చైతూ తాగుడుకు అల‌వాప‌డిపోతాడు. దీంతో ఆయ‌న‌కు శ్రావ‌ణి(స‌మంత‌)తో పెళ్లి చేస్తారు. అయితే.. తండ్రి ఒత్తిడిమేర‌కు స‌మంత‌ను చైతూ పెళ్లి చేసుకుంటాడుగానీ.. ఎన్న‌డు కూడా భార్య‌గా ఆమెను గుర్తించ‌డు. అయితే.. చివ‌ర‌కు చైతూ, స‌మంత‌ల మ‌ధ్య ప్రేమ ఎలా పెట్టింది..? చైతూలో మార్పు ఎలా వ‌చ్చింది..? అన్న‌ది మాత్రం తెర‌పై చూడాల్సిందే మ‌రి.

ఎవ‌రెలా చేశారంటే…
న‌ట‌న‌లో చైతూ రోజురోజుకూ త‌న‌నుతాను మెరుగుప‌ర్చుకుంటున్నాడు. త‌న న‌ట‌న‌లో విభిన్న‌మైన పార్శ్వాల‌ను కూడా ప‌లికించ‌డంలో ప‌రిణతి సాధిస్తున్నాడు. తాజాగా విడుద‌ల అయిన మ‌జిలి సినిమాలో ఆయ‌న‌లో ప‌రిణ‌తిగ‌ల న‌టుడు క‌నిపించాడు. ఈ సినిమాలో ఆయ‌న పాత్ర‌లో రెండు కోణాలు ఉన్నాయి. అల్ల‌రి యువ‌కుడిగా.. బాధ్య‌త‌గ‌ల యువ‌కుడిగా ఆయ‌న న‌ట‌న సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. సినిమా ఫ‌స్టాఫ్‌, స‌కండాఫ్‌లో చైతూ త‌న‌దైన న‌ట‌న‌తో ఇర‌గ‌దీశాడు. స‌మంత కూడా చైతూను మించిపోయింది న‌ట‌న‌లో. కొన్ని కొన్ని ఎమోష‌న‌ల్ సీన్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఉద్వేగానికి గురిచేసింది. ఇక మ‌రో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌. ఆమెకు తొలి సినిమానే అయినా.. త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది. ఫ‌స్టాఫ్ మొత్తం దివ్యాంశ త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించింది. రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా ఉందంటే…
శివా నిర్వాణ‌. నిన్నుకోరి సినిమాతోనే త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు. చిన్న ఎమోష‌న‌ల్ పాయింట్‌ను తీసుకుని మ‌జిలి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఎలాంటి ఆర్భాట‌ల‌కు పోకుండా… తాను చెప్ప‌ద‌ల్చుకున్న క‌థ‌నాన్ని చాలా చ‌క్క‌గా చూపించాడు. చైతూ, స‌మంత‌, దివ్యాంశ‌ల నుంచి అద్భుత‌మైన న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడు. ఇందులో ప్ర‌ధానంగా ఫ‌స్టాఫ్‌లో చైతూ అల్ల‌రి, దివ్యాంశ‌తో ప్రేమ అంశాలు ఎక్కడ కూడా ప్రేక్ష‌కుల‌కు బోర్‌కొట్ట‌కుండా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో అయితే.. ఎమోష‌న్‌ల్ సీన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. గోపిసుంద‌రం, త‌మ‌న్‌లు అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం క‌థ‌లో క‌లిసిపోయి సాగుతాయి. మిగ‌తా సాంకేతిక విలువ‌ల‌న్నీ కూడా సినిమా స్థాయిని మ‌రింత‌గా పెంచేశాయి.

చివ‌రిగా.. మ‌ర‌వ‌లేని మ‌జిలీ
రేటింగ్ : 3/5

మ‌జిలీ సినిమా రివ్యూ.. నాగచైతన్యకు హిట్టొచ్చిందోచ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts