నాని “జెర్సీ” ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..

April 17, 2019 at 10:12 am

నేచుర‌ల్ స్టార్ నాని- శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం జెర్సీ. ఈ చిత్రానికి గౌతం తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదొక క్రికెట‌ర్ లైఫ్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న సినిమా. ఈ సినిమాను ఈనెల 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్లు సినిమాపై భారీగా అంచ‌నాల‌ను పెంచేశాయి. అయితే.. ఇదే స్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఉంది. వివిధ రూపాల్లో సుమారు రూ.26కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది జెర్సీ సినిమా. ఇది శుభ‌సూచ‌క‌మేన‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి.

ప్ర‌ధానంగా జెర్సీ ట్రైల‌ర్ల‌లో నాని చెప్పే డైలాగ్స్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. అందులోనూ యూత్ అయితే.. సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా..? అని ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. వేస‌వి సెల‌వుల్లో ఈ సినిమా విడుద‌ల అవుతుండ‌డం మ‌రింత‌గా క‌లిసివ‌చ్చే అంశం. అయితే.. ఇక్క‌డ మ‌రొక అంశం ఉంది. ఈ సినిమాకు పోటీగా మ‌రొక సినిమా వ‌స్తోంది. అదే కాంచ‌న‌-3. ఇప్ప‌టికే కాంచ‌న‌-1, 2లు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్సం కురిపించాయి. ఈ క్ర‌మంలో కాంచ‌న‌-3పై కూడా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఉంది. దీనిని జెర్సీ ఎలా త‌ట్టుకుంటుందో చూడాలి మ‌రి.

ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

నిజాం,యూఏ రూ.10కోట్లు
సీడెడ్ రూ. 3.20కోట్లు
ఈస్ట్ రూ.1.60కోట్లు
కృష్ణా రూ.1.45కోట్లు
గుంటూరు రూ.1.80కోట్లు
వెస్ట్ రూ. 1.25కోట్లు
నెల్లూరు రూ. 0.80కోట్లు
ఏపీ, టీఎస్ రూ.20.10కోట్లు
ఆర్‌వోఐ రూ.1.90కోట్లు
ఓవ‌ర్సీస్ రూ. 4కోట్లు
వ‌ర‌ల్డ్‌వైడ్ రూ. 26కోట్లు

నాని “జెర్సీ” ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts