హీరో నుంచి జీరోదాకా పవన్ ప్రయాణం..!

April 16, 2019 at 4:30 pm

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అయిపోయింది. ఫ‌లితాల కోసం మే 23వ తేదీ వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ మ‌ధ్య‌లో అంతా ఉత్కంఠ స‌మ‌య‌మే. ఎవ‌రి లెక్క‌లు వారివే. ఎవ‌రి ధీమా వారిదే. అధికార టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ మ‌ధ్య హోరాహ‌రోరీగా పోరు సాగింది. అయితే.. మ‌ధ్య‌లో వ‌చ్చిన జ‌న‌సేన ఏ మేర‌కు ప్ర‌భావం చూపింద‌న్న దానిపై ఇప్పుడు రాజ‌కీయవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక‌ల‌పై క్లారిటీ ఉందిగానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాత్రం అయోమ‌యంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఓట‌మి త‌ప్ప‌దేమోన‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతుండ‌గా.. అధికారం త‌న‌దేన‌ని జ‌న‌గ్ ధీమాగా ఉండ‌గా.. ఏం జ‌రిగిందో తెలియ‌ని స్థితిలో ప‌వ‌న్ ఉన్నారు.

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఊపుమీదున్న స‌మ‌యంలోనే ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీతో జ‌నం ముందుకు వ‌చ్చారు. మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఇండ‌స్ట్రీని వ‌దులుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు. శ్రీ‌కాకుళం నుంచి ప్ర‌జాపోరాట యాత్ర పేరుతో ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఉద్వేగ‌పూరిత ప్ర‌సంగాల‌తో ఆక‌ట్టుకున్నారు. అధికార టీడీపీ, చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధానంగా ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే ఆయ‌న ఎక్కువ‌గా ప‌ర్య‌టించారు. మిగ‌తా జిల్లాల్లో ఆయ‌న ఎక్కువ‌గా ప‌ర్య‌టించ‌లేక‌పోయారు. త‌న సొంత సామాజిక‌వ‌ర్గం కాపులు బ‌లంగా ఉన్న ప్రాంతాల్లోనే ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లను మూట‌గ‌ట్టుకున్నారు.

2014 ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసిన ప‌వ‌న్ ఆత‌ర్వాత ఆ రెండు పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీకిప్ర‌త్యేక హోదా సాధించ‌డంలో టీడీపీ విఫ‌లం చెందిందంటూ మండిప‌డ్డారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప‌వ‌న్ డైలాగ్స్‌లో క్ర‌మంగా వ‌చ్చిన మార్పుతో యూత్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అధికార టీడీపీపై, చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు పూర్తి స్థాయిలో త‌గ్గించి, కేవ‌లం వైసీపీ అధినేత జ‌గ‌న్‌నే ప‌వ‌న్ టార్గెట్ చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొద‌టి నుంచీ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డాన్ని జ‌నం స్వాగ‌తించ‌లేదు. ఇది కూడా ప‌వ‌న్‌కు పెద్ద మైన‌స్‌గా మారింది.

మ‌రోవైపు.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టిసారించ‌కుండా.. కేవ‌లం భారీ డైలాగ్స్‌తో జ‌నాన్ని ప్ర‌ధానంగా యూత్‌ను ప‌వ‌న్ బాగా ఎంట‌ర్‌టైన్ చేశాడ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. తీరా ఎన్నిక‌లు వ‌చ్చేట‌ప్ప‌టికీ చంద్ర‌బాబు, ప‌వ‌న్ అంత‌ర్గతంగా ఒప్ప‌దం చేసుకున్నార‌ని, చంద్ర‌బాబుకు గెలిపించేందుకు ప‌వ‌న్ పాటుప‌డుతున్నార‌నే చ‌ర్చ జ‌న‌సేన శ్రేణుల్లోనూ చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో క్ర‌మంగా యూత్‌లోనూ ప‌వ‌న్ ఆద‌ర‌ణ కోల్పోయారు. మొద‌ట్లో ప‌వ‌న్ ప్ర‌సంగాల‌కు ఊగిపోయిన యూత్‌.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే ప‌వ‌న్ న‌డుస్తున్నాడ‌నే టాక్ బ‌లంగా రావ‌డంతో పూర్తిగా సైలెంట్ అయింది.

ఈ నేప‌థ్యంలో తాను అనుకున్న స్థాయిలో ఏపీ రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ ప్ర‌భావితం చేయ‌గ‌లిగారా..? లేక చేతులెత్తేశారా..? అన్న‌దే ఇప్పుడు కీల‌క‌మైన ప్ర‌శ్న‌. ఈ ఎన్నిక‌ల్లో బీఎస్పీ, ప‌లు వామ‌ప‌క్షాల‌తో క‌ల‌సి బ‌రిలోకి దిగిన‌ జ‌న‌సేన ఎన్ని పార్ల‌మెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుంద‌న్న‌ది ఎవ్వ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. గాజువాక‌తోపాటు భీమ‌వ‌రంలో పోటీ చేసిన ప‌వ‌న్ గెలుస్తాడో లేదోన‌నే డౌట్ ఇప్పుడు జ‌న‌సేన శ్రేణుల్లోనే వినిపిస్తోంది. పార్టీ మొత్తంగా ఒక‌టి రెండు అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల్లో గెల‌వ‌డం క‌ష్టంగా ఉంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ బ‌లం తెలియాలంటే.. మే 23వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

హీరో నుంచి జీరోదాకా పవన్ ప్రయాణం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts