రెండో భ‌ర్త గురించి చెప్పిన రేణుదేశాయ్‌..

April 16, 2019 at 11:52 am

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ త‌న రెండో పెళ్లి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించింది. ఎంగేట్‌మెంట్ అయిపోయిన త‌ర్వాత కూడా ట్రోలింగ్ ఆగ‌క‌పోవ‌డంపై ఆమె స్పందించింది. కొద్దికాలం కింద‌ట ఓ వ్య‌క్తితో ఆమెకు ఎంగేట్‌మెంట్ అయిన విష‌యం తెలిసిందే. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చేసుకోబోయే వ్య‌క్తి గురించి మాత్రం ఎప్పుడు కూడా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. ఆ విష‌యాన్ని చాలా గుట్టుగానే ఉంచింది.

దీనిపైనే అప్ప‌టి నుంచి ట్రోలింగ్ న‌డుస్తోంది. ఎంగేజ్‌మెంట్ అయి.. ఇన్ని నెల‌లు అయినా.. ఇంకా పెళ్లి చేసుకోవ‌డం లేదంటూ.. కామెంట్స్ వ‌చ్చాయి. దీంతో కొంత క‌ల‌త చెందిన రేణుదేశాయ్ త‌న రెండో పెళ్లి గురించి మ‌రోసారి స్పందించింది. “నాకు ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ఆ విష‌యం ప్రపంచమంతా తెలుసు. దీనిపై ఆమధ్య చాలా హడావుడి నడిచింది. ఎక్కువ వివరాలు ఇవ్వను కానీ అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా. నాది దొంగపెళ్లి కాదు. మా కుటుంబంలో అందరి ఆమోదంతో జరుగుతోంది“ ఆమె చెప్పుకొచ్చింది.

త‌న పెళ్లి గురించి త‌న‌కు త‌ప్ప మిగ‌తా అంద‌రికీ కొంత హ‌డావుడి ఎక్కువైంద‌ని.. తొంద‌ర‌లోనే పెళ్లి చేసుకుంటాన‌ని రేణు దేశాయ్ చెప్పింది. అయితే.. ఇక్క‌డ కొస‌మెరుపు ఏమిటంటే.. త‌న‌కు కాబోయే రెండో భ‌ర్త పేరు చెప్ప‌కుండానే.. ఆయ‌న‌ గురించి కొన్ని విష‌యాలు మాత్రం చెప్ప‌డం గ‌మ‌నార్హం. పూణెలోని ఓ ఐటీ కంపెనీలో డైరక్టర్ స్థాయిలో ఆయ‌న ప‌నిచేస్తాడ‌ని, మొన్నటివరకు అమెరికాలోనే ఉన్న ఆయ‌న‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌లే పుణెలోనే ఉంటున్న‌ట్లు రేణు చెప్పుకొచ్చింది.

రెండో భ‌ర్త గురించి చెప్పిన రేణుదేశాయ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts