కాకి లెక్క‌ల కాకారావ్ మ‌ళ్లీ వ‌చ్చారు..!

April 15, 2019 at 12:06 pm

చంద్ర‌బాబు అనుయాయులు ఓట‌మ‌ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. బాబు గారేమో ఢిల్లీలో తిరుగుతూ సానుభూతి పెంచుకుని, సింప‌తి కొట్టేయాల‌ని విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తుంటే, ఏపీలో ఆయ‌న బ‌ల‌గం మాత్రం ఏదోఓటి మాట్లాడో, న‌టించో వార్త‌ల్లో నిలిచి పార్టీని బ‌తికించుకునే ప్ర‌య‌త్నం ముమ్మ‌రం చేస్తున్నారు. చుక్క‌తెగిప‌డిన‌ట్టు అమావాస్య‌కు ఓ మారు, పౌర్ణ‌మికి ఓమారు మీడియా ముంద‌కొచ్చి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడి సంచ‌ల‌నం రేకెత్తించేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

అలాంటి కోవ‌లోకి మొద‌ట వ‌స్తారు సినీ నటుడు శివాజీ. ఆయ‌న తెలుగుదేశం పార్టీ కండువా క‌ప్పుకోని వీరాభిమానిగా చెప్పుకోవ‌చ్చు. ఎప్పుడు టీడీపీకి క‌ష్ట‌కాల‌మొచ్చిన టాపిక్‌ను ప‌క్క‌కు మ‌ళ్లించ‌డానికి త‌న వంతుగా కూత‌లు కూసి మీడియాలో హాట్‌టాపిక్ క్రియేట్ చేసి చ‌ల్ల‌గా జారుకుంటారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల వ‌ర‌కు అటువైపుగా మ‌ళ్లీ క‌నిపించ‌రు. ఇలా దాదాపు ఐదారేళ్లుగా అదే వ‌ర‌స కొన‌సాగిస్తూ టీడీపీకి వీర‌విధేయుడిగా నిలిచి త‌న సొంత ఇమేజ్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఎలాగూ సినిమాలు లేక‌పోవ‌డంతో రాజ‌కీయంగానైనా త‌న ప‌లుకుబ‌డిని పండించుకుందామ‌ని ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటాడు. ఇప్పుడు ఎన్నిక‌ల ముగిసిన వేళ స‌రిగ్గా అదే కార్యానికి శ్రీ‌కారం చుట్టారు. గెలుపు ఎలాగైనా టీడీపీదే అని చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతున్నారు. లెక్క‌లేవి ప‌ట్టించుకోకుండా చంద్ర‌బాబు సీఎం అంటూ జోస్యం చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు, అనంత‌పురం పూర్తిగా సహ‌క‌రించ‌క అధికారానికి దూరం అయిన విష‌యం తెలిసిందే. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఆ మూడు జిల్లాలు పూర్తిగా వైసీపీకే అనుకూలంగా మారిన విష‌యాన్ని మ‌ర‌చిపోయి లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ బాబుకు కాస్త‌లో కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించి, త‌న ప‌బ్బం గ‌డుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఆ హీరోగారు. లెక్క‌లేసుకోకుండా మ‌రీ గుడ్డిగా మాట్లాడితే ప‌రిస్థితి ఎల్ల‌ప్పుడూ తారుమారు అవుతాయ‌నే క‌నీసం ధ‌ర్మ‌రం మ‌రిచి పోతే ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు. పాపం శివాజీ.!

కాకి లెక్క‌ల కాకారావ్ మ‌ళ్లీ వ‌చ్చారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts