జనసేన ఎఫెక్ట్.. టీడీపీకి సీట్ల లాస్ లెక్క‌లివే..

April 25, 2019 at 11:11 am

ఏపీలో పోలింగ్ ముగిసింది. ఓటరు నాడీ ఏ పార్టీ వైపు ఉంది అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరో 25 రోజులకు పైగా సమయం ఉంది. ఈ లోగా ఎవరికి వారు తమకు అనుకూలమైన లెక్కల్లో మునిగి తేలుతున్నారు. టిడిపి, వైసీపీతో పాటు జనసేన నుంచి పోటీ చేసిన వారిలో ఎవరిని కదిపినా గెలుపు తమదే అని చెబుతున్నారు తప్ప తాము ఓడిపోతామని చెబుతున్న వారు ఒక్కరూ లేరు. రేపటి ఎన్నికల్లో గెలుపు టిడిపిదా, వైసిపిదా అన్నది మాత్రమే తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన జనసేన అధికారంలోకి వస్తుందన్న అంచనాలు లేకపోయినా టిడిపి, వైసీపీలను చాలా నియోజకవర్గాల్లో దెబ్బ కొట్టబోతున్నది రేపటి ఫలితాల్లో తేల‌నుంది. జనసేన దెబ్బ టిడిపి మీద ఎన్ని సీట్లలో ఉండబోతోంది… వైసిపి మీద ఎన్ని సీట్లలో ఉండబోతోంది అన్నది తల పండిన రాజకీయ నేతలకు సైతం ఖ‌చ్చితంగా అంచ‌నాకు దొరకడం లేదు.

తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపిక మా ఎమ్మెల్యే అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన ఎఫెక్ట్ వైసిపి కంటే టిడిపి పైనే ఎక్కువగా ఉందన్న వ్యాఖ్యలు బాబు చేశారు. బాబు నాయకులతో సంబంధం లేకుండా మీడియా వర్గాలు, రాజకీయ మేథావులు సైతం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట జనసేన ప్రభావం ఉందని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ జరిగిన తీరును బట్టి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణ, గుంటూరు జిల్లాలో జనసేన ప్రభావం గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన సపోర్టుతో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు టిడిసి క్లీన్‌స్విప్‌ చేసేసింది. ఇక తూర్పుగోదావరిలోనూ జనసేన టిడిపికి మద్దతు ఇవ్వడంతో కాపులు అందరూ చంద్రబాబును గెలిపించారు. గత ఎన్నికల్లో టిడిపి 19 సీట్లకు 14 చోట్ల విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరుతో ఉభయగోదావరి జిల్లాల్లో టిడిపికి తిరుగులేని ఎదురు దెబ్బ తగిలింది. ఇదే విషయాన్ని టీడీపీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. చంద్రబాబు చేయించుకున్న సర్వేల ప్రకారం 36 నియోజకవర్గాల్లో జనసేన వల్ల టిడిపికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు స్పష్టంగా తేలింది. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ఆయువుపట్టుగా ఉన్న ఈ రెండు జిల్లాలలో టీడీపీకి ఈ సారి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశాలు లేవన్న విషయాన్ని టీడీపీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఉభయగోదావరి, కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాపు యువతలో మెజారిటీ ఓట్లు జనసేనకే పడ్డాయి. ఇక జనసేన ప్రభావం వైసీపీపై కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న అది చాలా చాలా తక్కువగా మాత్రమే ఉంది. జనసేన వల్ల తమకంటే టీడీపీకే ఎక్కువ నష్టం జరిగినట్టు వైసీపీ వర్గాలు కూడా ఒప్పుకున్నాయి. జనసేన వల్ల వైసిపి కేవలం 10 నుంచి 12 సీట్లలో మాత్రమే కొద్దిగా ఇబ్బందికి గురైనట్టు ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాయలసీమలోని ఐదారు నియోజకవర్గాలు… గుంటూరు, కృష్ణా జిల్లాలో మరో నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే జ‌న‌సేన‌ వల్ల గెలుపు ఓట‌ములు కాస్త అటూ ఇటూ అయ్యే ఛాన్స్ ఉంది. జనసేన వల్ల వైసిపి ఇబ్బందికి గురి అయిన ఈ నియోజకవర్గాల్లో వైసిపి ఓడిపోతుందని, టిడిపి గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నియోజకవర్గంలో జనసేన ఓట్లు చీల్చడం వరకు మాత్రమే చేసింది. ఆ పార్టీకి ఎలాగో గెలిచే స్కోప్ లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపి గెలవడానికి ఎంత స్కోప్ ఉందో ? ఇటు వైసీపీ గెలుపు అంతే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జనసేన వల్ల టిడిపికి గెలుపు డోలాయమానంలో పడింది అంటే ఆ పార్టీ అధికారంలోకి రావటం సంక్లిష్టంగానే కనిపిస్తోంది.

జనసేన ఎఫెక్ట్.. టీడీపీకి సీట్ల లాస్ లెక్క‌లివే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts