జ‌గ‌న్ ధాటికి టీడీపీ ఖాళీయేనా..!

April 18, 2019 at 11:38 am

రాబోయే రోజుల్లో టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన‌బోతుందా..? ఆఖ‌రికి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌ ఆ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మార‌బోతుందా..? ఈ ఎన్నిక‌ల్లో వార్‌వ‌న్‌సైడేన‌ని తేలిపోయిన నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్లు మూట‌ముల్లె స‌ర్దుకుంటున్నారా..? వ‌రుస‌క‌ట్టి వైసీపీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌కు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఫ‌లితాలు మే 23న వెలువ‌డ‌నున్నాయి. కానీ.. ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మాత్రం ఓ విష‌యంలో ప‌క్కా క్లారిటీ ఉంది. అదేమిటంటే.. ఈఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని..!

అయితే..2014 ఎన్నిక‌ల్లో కొద్దిపాటి తేడాతో అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగెత్తిపోయారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి, దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు తెర‌తీశారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేక‌పోయారు. అయితే.. ఇదే స‌మ‌యంలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏడాదిపాటు నిర్విరామంగా పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల‌ను తెలుసుకున్నారు. అందుక‌నుగుణంగా ఎన్నిక‌ల మేనిఫెస్టో ప్ర‌క‌టించారు. అయితే.. ఈ ఐదేళ్ల‌లో వైసీపీ మ‌రింత బ‌లోపేతం కావ‌డంతో అధికార టీడీపీలో వ‌ణుకుమొద‌లైంది. తీరా ఎన్నిక‌ల ముందు వైసీపీలోకి వ‌రుస‌క‌ట్టారు.

ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు, ద్వితీయ‌శ్రేణి నాయ‌కులు వైసీపీలోకి వ‌రుస‌క‌ట్టారు. ఒకానొక ద‌శ‌లో చాలా అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు పోటీ నుంచి త‌ప్పుకునే ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఇక పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తే.. వైసీపీ ఘ‌న విజ‌యం ఖాయంగానే క‌నిపిస్తోంది. దీంతో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వైసీపీ గూటికి చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ న‌మ్ముకుని పార్టీలో కొన‌సాగే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని ఏపీలో టీడీపీ ఎదుర్కొన‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే స‌గం మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిన విష‌యం తెలిసిందే. మ‌రికొంద‌రు కూడా క్యూలో ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంద‌ని, టీడీపీ ఖాళీ అవుతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. చంద్ర‌బాబు కూడా వృద్ధాప్యంలోకి వ‌చ్చార‌ని, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ పార్టీని న‌డిపించ‌లేర‌ని, ఈ నేప‌థ్యంలో త‌మ‌దారి తాము చూసుకోవ‌డ‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌కు ఇప్ప‌టికే తెలుగుత‌మ్ముళ్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

జ‌గ‌న్ ధాటికి టీడీపీ ఖాళీయేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts