జ‌గ‌న్ విశ్వ‌రూపం.. రికార్డులే రికార్డులు

April 22, 2019 at 4:11 pm

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి ఏపీకి సీఎం అయితే, ఏం జ‌రుగుతుంది? ఆయ‌న అభివృద్ధి చేయ‌గ‌ల‌డా? ఆయ‌న ఏపీని ఇబ్బం దుల నుంచి బ‌య‌ట‌కు తీసుకురాగ‌ల‌డా? ఇలాంటి ప్ర‌శ్న‌లు అనేకం తెర‌మీదికి వ‌చ్చాయి. నిజానికి ఇదే విష‌యాన్ని చంద్ర బాబు కూడా హైలెట్ చేశారు. జ‌గ‌న్ సీఎం అయితే, ఇబ్బందులు మ‌రిన్ని పెరుగుతాయ‌ని, పెట్టుబ‌డులు కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, వ‌చ్చిన పెట్టుబ‌డులు కూడా ప‌క్క‌కు పోయే ప్ర‌మాదం ఉంద‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. ఇక‌, ఏపీకి ప్ర‌త్యేక హోదా తేవాలంటే.. త‌న లాంటి రాజ‌నీతిజ్క్షుడికి మాత్ర‌మే సాధ్య‌మైన ప‌నిగా బాబు వ‌ర్ణించారు. అయి తే, వాస్త‌వా నికి జ‌గ‌న్‌లో రాష్ట్రాన్ని పాలించే స‌త్తాలేద‌నే అనుకోవాలా?

ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌ల తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్తం అయిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు, స‌ర్వేల నివేదిక‌ల ను బ‌ట్టి.. వైసీపీ అధికారంలోకివ‌స్తుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ చెబుతున్న మాట‌. ఇది నిజ‌మై.. జ‌గ‌న్ సీఎం అయితే.. ఏపీకి మ హర్ధ‌శ ప‌డుతుందా? ఏపీకి మ‌రో స‌రికొత్త రూపు వ‌స్తుందా? అనే అంచ‌నాలు పెరుగుతున్నాయి. నిజానికి ఏపీ ఇప్పుడు అత్యంత క్రూషియ‌ల్ స్టేజ్‌లో ఉంది. రాజ‌ధాని నిర్మాణం, పెట్టుబ‌డుల రాక‌, పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి, వివిధ ద‌శ‌ల్లో పెట్టుబ‌డుల ప్రోత్సాహం, తెలంగాణ నుంచి నెల‌కొన్న జ‌ల వివాదాల‌ను స‌ర్దు బాటు చేసుకోవ‌డం, విభ‌జ‌న అంశం ద్వారా ఏపీకి రావా ల్సిన నిధులు, నీళ్లు వంటివి ఈ ఐదేళ్ల కాలంలోనూ చాలా కీల‌కంగా మారాయి.

ఈ విష‌యాల‌నే ప‌దే ప‌దే ప్ర‌చారం చేసిన సీఎం చంద్ర‌బాబు.. వీటిని సాధించ‌డం త‌న ఒక్కడి వ‌ల్లే సాధ్య‌మ‌వుతుం ద‌ని వెల్ల‌డించారు. త‌న లాంటి అప‌ర మేధావిని వ‌ద‌లుకుంటారా? అనికూడా ప్ర‌ద‌ర్శించారు. కానీ, మ‌రో ఐదేళ్ల పాటు చంద్ర బాబు సీఎంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీకి వీటిని తీసుకు వ‌చ్చి పెడ‌తార‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లే దు. జ‌గ‌న్ వ్యూహాల‌ను కాపీ కొట్టిన చంద్ర‌బాబు కేంద్రంపై అవిశ్వాసం నుంచి ప్ర‌త్యేక హోదా డిమాండ్ వ‌ర‌కు కూడా జ‌గ‌న్ వేసిన ప్లాన్‌ల‌నే బాబు ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇదే విష‌యంపై ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. అధికారంలో లేక‌మునుపే జ‌గ‌న్ ఇలా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.. అధికారం ఇచ్చి చూస్తే.. ? అనే ప్ర‌శ్న ఉద‌యించింది.

ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌గ‌న్‌కు అధికారం క‌ట్ట‌బెట్ట‌డం నిజానికి ఆయ‌న కోరిన విధంగా ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్ ఏమాత్ర‌మూ కాదు. కేవ‌లం ఏపీ అభివృద్ధి విష‌యంలో జ‌గ‌న్ వ్యూహాల‌పై ప్ర‌జ‌లకు చాలానే ఆశ‌లు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ వ్యూహాలు స‌క్సెస్ అయి.. మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించి, ఏపీని అభివృద్దిలో న‌డిపిస్తే.. జ‌గ‌న్‌కు తిరుగులేద‌ని అంటున్నారు. ఆయ‌న అన్ని రంగాల్లోనూ రికార్డులు సాదించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ విశ్వ‌రూపం.. రికార్డులే రికార్డులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts