తాజా మాట …వైసీపీదే అధికారం !

April 22, 2019 at 3:55 pm

ఏపీ గ‌తంలో ఎన్న‌డూ లేని రాజ‌కీయ ఉత్కంఠ కొన‌సాగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో కానీ, 2009 ఎన్నిక‌ల్లోకానీ, లేదా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన 2004 ఎన్నిక‌ల్లో కానీ లేని ఉత్కంఠ నేడు నెల‌కొంది. ఈ నెల 11 ఎన్నిక‌లకు ముందు ఎలాంటి ఉత్కంఠ ప‌రిస్థితి ఏపీలో నెల‌కొందో.. దానికి నాలుగింత‌లైన ఉత్కంఠ నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క‌నిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ ఏ ఇద్ద‌రు క‌లిసినా చ‌ర్చించుకునే ఏకైక విష‌యం ఏపీలో ఎవ‌రిది విజ‌యం? ఏపీలో ఎవ‌రిది అధికారం? అనే! ప్ర‌ధానంగా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌చారం వ‌ర్క‌వుట్ అయిందా? లేదా? అనే విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఏపీలో నెల‌కొన్న‌ద‌న‌డం లో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర విభ‌జ‌న, అనంత‌ర ఏపీ అభివృద్ధి అనే విష‌యాలు అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పాత్ర పోషించాయి.

దీంతో జ‌గ‌న్ ఎంత ప్ర‌చారం చేసినా.. పెద్ద‌గా ఫ‌లితం క‌నిపించ‌లేదు. కానీ, దీనికి భిన్నంగా ఏపీలో ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా సాగింద‌నే ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతోంది. ఎన్నిక‌ల‌కు దాదాపు ఏడాదిన్న‌ర ముందుగానే జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ఏపీలో నిర్వ‌హించిన సుదీర్ఘ పాద‌యాత్ర ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని అంటున్నారు. గ్రామ గ్రామానా జ‌గ‌న్ తిరిగిన తీరు, ప్ర‌తి ఒక్క‌రికీ చేరువైన తీరు కూడా ప్ర‌జ‌ల‌ను వైసీపీ వైపు న‌డిపించింద‌ని అంటున్నారు. ఇక‌, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ పుంజుకున్న‌ప్ప‌టికీ.. చాలా మంది వాద‌న మాత్రం ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వైసీపీ పుంజుకోలేద‌ని! అయితే, ఈ విష‌యంపై నా దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌ను కూడా ప్ర‌చారంలో ప్ర‌ధాన టార్గెట్ చేసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు నుంచే త‌న కుటుంబ స‌భ్యుల‌ను సైతం రంగంలోకి దింప‌డం క‌లిసి వ‌చ్చిన ప‌రిణామం.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కుటుంబం నుంచి ఆయ‌న మాతృమూర్తి, సోద‌రి మాత్రమే ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌గా ఈ ద‌ఫా మాత్రం పులివెందుల స‌హా క‌డ‌ప లోని రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి కూడా రంగంలొకి దిగి ప్ర‌చారం నిర్వ‌హించారు. దీనిని ఎవ‌రూ కూడా ఊహించ‌లేదు. ఇక‌, న‌వ‌ర‌త్నాలు స‌హా ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక చేసే ప్ర‌తి ప‌నినీ పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌జ‌ల ముందు ఉంచుతాన‌న్న విష‌యం కూడా ప్ర‌జ‌ల‌లోకి బాగా వెళ్లింది. ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ అయ్యేలా త‌న హావ‌భావాల‌ను జ‌గ‌న్ మార్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ మార్పు కోసం ప్ర‌జ‌లు ఎదురు చూడ‌డం, ముఖ్యంగా రాజ‌న్న రాజ్యం కోసం వృద్ధులు, యువ‌త కూడా ఎదురు చూడ‌డం వంటివి ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన అంశాలుగా చెప్ప‌వ‌చ్చు. ఇలా ఎలా చూసుకున్నా.. అధికార పార్టీని మించిన హ‌వాతో జ‌గ‌న్ దూసుకుపోయార‌ని అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలో జ‌గ‌న్ రాజ్యం ఖాయ‌మ‌నే వాద‌న ఏ ఇద్ద‌రు క‌లిసినా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం.

తాజా మాట …వైసీపీదే అధికారం !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts