జ‌గ‌న్‌పై సైలెంట్ వార్‌.. అందుకేనా..?

April 23, 2019 at 10:41 am

రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. మ‌రో 30 రోజుల వ‌ర‌కు కూడా గెలుపు గుర్రం ఎవ‌రెక్కుతారు? ఎవ‌రు గెలుస్తా రు? ఎవ‌రు అధికార పీఠంపై నిల‌బ‌డ‌తారు? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌క‌దు. అయితే, ఎన్నిక‌లకు ముందు ఎలాం టి ప‌రిస్థితి ఉన్నా.. ప్ర‌చారం, వ్యాఖ్య‌లు వంటి కీల‌క విష‌యాల్లో అధికార పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. పోలింగ్ విష యానికి వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు వీచాయ‌ని అనేక స‌ర్వేలు, విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నా యి. ఇక‌, ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప్ర‌జ‌ల్లో అనూహ్య‌మైన వార్ ఒక‌టి సైలెంట్‌గా అండ‌ర్ క‌రెంట్‌గా ప‌నిచేసింది.

అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు కూడా ప్ర‌తి జిల్లాలోనూ జ‌గ‌న్ పాజిటివ్ థింకింగ్ బాగా ప‌నిచేసింది. `మార్పు` అనే మాట బాగా వినిపించింది. క్లాస్ నుంచి మాస్ వ‌ర‌కు కూడా ఇదే త‌ర‌హా మార్పు అనే మాట ఎవ‌రూ ప్ర‌చారం చేయ కుండా నే ప్ర‌జ‌ల నోళ్ళ‌లో నానింది. మ‌ర‌క మంచిదే.. అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల్లో మార్పు మంచిదే అనే వ్యాఖ్య‌లు జోరుగా ఉ ద్రుతంగా `పులిరాజు` అనే ప్ర‌క‌ట‌న ఏవిధంగా దూసుకుపోయిందో గ్రామ గ్రామాన , ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు అన్నింటి లో నూ ఈ మార్పు తాలూకు ప‌రిస్థితి క‌నిపించింది. మ‌హిళ‌లు, వృద్ధులు కూడా మార్పు దిశ‌గా దూసుకుపోయా రు.

ఇది వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా అనుకూలంగా మారింద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. నిజానికి అటు అధికార పార్టీ, ఇటు మ‌రో ఆశావ‌హ పార్టీల నుంచి జ‌గ‌న్‌పైనా ఆయ‌న నాయ‌కుల‌పైనా కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, రాష్ట్ర అభివృద్ధి మ‌రోప‌క్క రాష్ట్రాన్ని ఒక ర‌స‌కందాయ ప‌రిస్థితిలోకి నెట్టాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు అధి కారంలోకి వ‌స్తారు? అనే విష‌యాల‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చలు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే ఏ మీడియా కూడా ప్ర‌చా రం చేయ‌ని మార్పు, ఒక్క అవ‌కాశం అనే నినాదాలు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ఈ దిశ‌గానే ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగాయి.

మార్పు, ఒక్క అవ‌కాశం అనేది నిజానికి వైసీపీ పుట్టించిన ప‌దాలు కూడా కాదు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ప‌దాలుగానే భావించాలి. ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత అన్న‌ట్టుగా జ‌గ‌న్ అనేక కార్య‌క్ర‌మాలు చేశారు. ఓదార్పు యాత్ర‌, పాద‌యాత్ర ఇలా అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. విజ‌య‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల కోసం బ‌తికే నాయ‌కుడిగా జ‌గ‌న్‌ను గెలిపించుకోవ‌డం ప్ర‌జ‌ల బాధ్య‌త అయిందా? అనే త‌ర‌హాలో ఇప్పుడు విశ్లేష‌ణ‌లు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్‌పై సైలెంట్ వార్‌.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts