జ‌గ‌న్‌కు మ‌మ‌త శుభాకాంక్ష‌లు..

April 15, 2019 at 10:09 am

తెలుగురాష్ర్టాల్లో ఎన్నిక‌లు ముగిశాయి. ప్ర‌జ‌ల తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉంది. ఎన్నిక‌ల వేళ లేని ఆర్భాటానికి వెళ్లిన చంద్ర‌బాబు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖుల‌ను తెచ్చుకుని ప్ర‌చారంలో దింపారు. జన హ్రుద‌యాల్లో లేని ఆద‌ర‌ణ వేరే రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌తో, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో చేస్తే మాత్రం ఎలా వ‌స్తుంద‌నుకున్నారో ఏమోగానీ బాబు వ్యూహం బెడిసి కొట్టింది. ప్ర‌జ‌లు త‌మ ఓటును అమూల్య‌మైన ఫ్యాన్‌కే వేసి తీర్పును రిజ‌ర్వులో ఉంచారు. అన్ని రాష్ర్టాల నాయ‌కుల‌కు ఏపీ రాజ‌కీయాలు చాలా ఉత్కంఠ‌ను రేపాయి.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు ప్ర‌ద‌క్షిణ‌లు చూసిన దేశం నివ్వెర‌బోతోంది. అలాగే, ఓట‌మి భ‌యంతోనే బాబు ఆడుతున్న కొత్త నాట‌కాన్ని కూడా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ గెలుపు దాదాపు ఖాయ‌మైన్న‌ట్టు స‌ర్వేలు కూడా చెబుతున్నాయి. అన్ని రాష్ర్టాలు ఏపీ డేటాను క‌నిపెడుతూ ఇప్పుడు త‌మ దారుల‌ను వెతుక్కుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే రేపొద్దున ఢిల్లీలో చ‌క్రం తిప్పాల‌నుకున్న నాయ‌కులు ముంద‌స్తుగానే ఏపీ రాజ‌కీయాల‌తో బంధం పెంచుకుంటున్నారు. త‌మకు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఎలాగైనా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మే అని మొత్తంగా తేలిపోయింద‌ని ఆ ధీమాతోనే మ‌మ‌త జ‌గ‌న్‌కు ఫోన్ చేసి ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపి ముందుముందు జ‌రుగ‌బోయే ప‌రిణామాల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబు ఢిల్లీ ప్ర‌ద‌క్షిణ‌ల‌తో యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల ద్రుష్టిలో మ‌రింత తేల‌క‌వుతూ త‌న ప‌త‌నాన్ని తానే రాసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్‌కు మ‌మ‌త శుభాకాంక్ష‌లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts