ఆచంట‌లో పితాని గెలుపు డౌటేనా..!

May 18, 2019 at 4:14 pm

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంటలో జ‌రిగిన ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. గ‌త ఎన్నిక‌ల నాటికి ఇప్ప‌టికీ .. ఇక్క‌డ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారీగా ఓట్లు చీలిపోవ‌డం, పార్టీల సంఖ్య పెర‌గ‌డం, కీల‌క‌మైన నాయ‌కులు రంగంలో ఉండ‌డంతో ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ 2800 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే, అప్ప‌ట్లో అన్ని ఈక్వేష‌న్లు కూడా మంత్రికి క‌లిసి వ‌చ్చాయి. ఒక‌ప‌క్క చంద్ర‌బాబు వ్యూహం.. మ‌రోప‌క్క జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌చారం కూడా క‌లిసి వ‌చ్చింది.

దీంతో ఆ ఎన్నిక‌ల్లో పితాని గెలుపు కొంత వ‌ర‌కు బెట‌ర్ అనిపించింది. ఆ ఎన్నిక‌ల్లో కూడా కేవ‌లం క్రాస్ ఓటింగ్‌తోనే పితాని బ‌య‌ట‌ప‌డ్డారు. ఎంపీకి వ‌చ్చేస‌రికి వైసీపీ అభ్య‌ర్థి వంక ర‌వీంద్ర‌కు 13 వేల ఓట్ల మెజార్టీ రాగా అసెంబ్లీకి మాత్రం పితాని స్వ‌ల్ప తేడాతోనే గెలిచారు. 2004, 09 ఎన్నిక‌లతో పాటు గ‌త ఎన్నిక‌ల్లోనూ పితానికి ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గం అయిన శెట్టిబ‌లిజ‌లు వ‌న్‌సైడ్‌గా స‌పోర్ట్ చేసి గెలిపించారు.
అయితే, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. సొంత సామాజిక వ‌ర్గం శెట్టి బ‌లిజ‌లే ఆయ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇక‌, సొంత పార్టీలోనూ కీల‌క నాయ‌కులు క‌లిసి రాలేద‌నే ప్ర‌చారం సాగుతోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం ఉండ‌డం, టీడీపీ వారిని తిట్ట‌డం నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు కూడా స‌మ‌యానికి ఇప్పుడు పితానికి హ్యాండిచ్చార‌ని అంటున్నారు. దీంతో పితాని వ్య‌తిరేకులు ఎమ్మెల్యేకి వైసీపీకి వేసి ఎంపీ ఓటును మాత్రం టీడీపీకి వేశార‌ని స‌మాచారం.

దీంతో ఇక్క‌డ పితాని వ‌ర్గం అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయింది. గెలుపు ఫ‌లితం తెలిసే వ‌ర‌కు కూడా ఇక్క‌డ ఆశ‌లు స‌న్న‌గిల్ల‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి పోటీ చేసిన అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చె రుకువాడ శ్రీరంగనాథరాజు ఇక్క‌డ గ‌ట్టిపోటీ ఇచ్చారు. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలోని క్ష‌త్రియులు మొత్తం ఏక‌మయ్యా రు. ఇక్క‌డ నుంచి చెరుకువాడ‌ను గెలిపించాల‌నే వ్యూహంతో ముందుకు సాగారు. ఇరువురు నేతలు కాకలు తీరిన వారే. పోల్‌ మేనేజ్‌మెంటులో ఇద్దరిదీ ప్రత్యేక శైలి. ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు కావ‌డంతో ఇక్క‌డ పోరు హోరా హోరీగానే సాగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాతంగా ముగియడంతో ఇరువురు అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. గెలుపు తమదంటే తమదే అన్న ధీమా ఇరు పార్టీల్లోనూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ స‌మీక్ష‌ల్లో ఓట్లు చీలిపోవ‌డం, సామాజిక వ‌ర్గాల వారీగా ఓటింగ్ జ‌ర‌గ‌డంతో పితాని ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను సులువుగా గెలిపించే శెట్టిబ‌లిజ వ‌ర్గం ఓట‌ర్ల‌ను వైసీపీ నిలువునా చీల్చేయ‌డం.. గ‌త ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ చేసిన కాపు వ‌ర్గం ఓట్లు జ‌న‌సేన చీల్చుకోవ‌డం… ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్లు వైసీపీకి వ‌న్‌సైడ్‌గా ఓట్లేయ‌డంతో ఈ సారి పితానికి దెబ్బ‌ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఆచంట‌లో పితాని గెలుపు డౌటేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts