ఆంధ్రప్రదేశ్లో “కుల” ఆధారిత ఎగ్జిట్ పోల్స్ నిజమెంత !

May 22, 2019 at 11:04 am

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై కులాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. కులాల ప్రాతిప‌దిక‌న ఇక్క‌డ ఓట‌ర్లు విడిపోయి ఉంటారు. ఏ కులం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉంటారో ఆ కులం అభ్య‌ర్థినే పార్టీలు రాజ‌కీయ బ‌రిలో నిలుపుతూ వ‌స్తుంటాయి. గెలుపోట‌ములు కూడా ఒకే కులం అభ్య‌ర్థుల మ‌ధ్య ఉంటూ వ‌స్తుంటాయి. అనేక ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన స‌భ్యులు పాలిస్తున్ననియోజ‌క‌వ‌ర్గాలు అనేకం ఏపీలో క‌న‌బ‌డుతుంటాయి. ద‌శాబ్ధాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతూ…త‌మ త‌ర్వాత వార‌స‌లుగా..ప్ర‌త్యామ్నాయంగా అదే కుటుంబానికి చెందిన వారు పోటీ చేయ‌డం క‌ద్దుగా వ‌స్తోంది.

ఇక ప్ర‌స్తుత రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ కుల ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. అయితే కులం ఆధారంగా ఓటింగ్ జ‌రిగిన విధానాన్ని కొన్ని మీడియా సంస్థ‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించాయి. ఇందులో అనేక కులాలు టీడీపీ క‌న్నా వైసీపీ వైపే మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా బీసీలు, ద‌ళితులు, మైనార్టీలు, ద‌ళిత క్రిస్టియ‌న్ వ‌ర్గాల ప్ర‌జ‌లు వైసీపీ వైపే మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తోంది. అభివృద్ధి అంశాల‌ను ద్వితీయ అంశంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు మీడియా సంస్థ‌లు భావించాయ‌ట‌.

ఇదిలా ఉండ‌గా టీడీపీ మాత్రం త‌మ‌కు సైలెంట్ ఓటింగ్ ఉంద‌ని చెప్పుకొస్తోంది. ముఖ్యంగా త‌మ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో చేప‌ట్టిన అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాలే త‌మ వైపు ప్ర‌జ‌ల‌ను నిల‌బెట్టాయ‌ని పేర్కొంటున్నారు. కులం క‌న్నా అభివృద్ధి సంక్షేమ అంశాల‌నే ప్ర‌జ‌లు ప్రాధాన్యంగా తీసుకున్న‌ట్లు తెలుపుతున్నారు. ప్ర‌భుత్వం ద్వారా ల‌బ్ధి పొందిన పింఛ‌న్ ల‌బ్ధిదారులు, విక‌లాంగులు,డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు, విద్యార్థులు కూడా టీడీపీకి అండ‌గా ఉన్నార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అయితే కుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఏపీలో ఇవ‌న్నీ ప‌క్క‌కుపోతాయ‌ని, జ‌గ‌న్నేజ‌నాలు న‌మ్మార‌ని వైసీపీ శ్రేణులు ఘంటాప‌థంగా చెప్పుకొస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో “కుల” ఆధారిత ఎగ్జిట్ పోల్స్ నిజమెంత !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts