దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్

May 15, 2019 at 12:46 pm

ఎఫ్ 2 హిట్‌తో యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అనిల్ తెర‌కెక్కించిన నాలుగు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్‌, సుప్రీమ్, రాజా ది గ్రేట్ త‌ర్వాత తాజాగా ఈ సంక్రాంతికి సీనియ‌ర్ హీరో వెంకీ, యువ హీరో వ‌రుణ్‌తేజ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎఫ్ 2 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టి టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోల‌కు, ట్రేడ్ వ‌ర్గాల‌కు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది.

ఈ త‌రం ప్రేక్ష‌కులు మెచ్చేలా కామెడీ జ‌న‌రేట్ చేయాలంటే అది ఒక్క అనిల్ రావిపూడి వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని పెద్ద హీరోలు సైతం న‌మ్మే రేంజ్‌కు అనిల్ చేరిపోయాడు. దీంతో ఇప్పుడు మ‌హేష్‌బాబు లాంటి స్టార్ హీరోలు సైతం బ‌డా బ‌డా ద‌ర్శ‌కులు చెప్పిన స‌బ్జెక్టుల‌ను కాద‌ని అనిల్‌కు ఛాన్స్ ఇచ్చారు. మ‌హ‌ర్షి హిట్‌తో జోష్‌లో ఉన్న మ‌హేష్ త‌న నెక్ట్స్ సినిమాను అనిల్‌తోనే చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పిలిచి మరీ అతనికి అవకాశం ఇచ్చాడంటే అనిల్‌ క్రేజ్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.  అందుకే రావిపూడి కూడా తన రెమ్యునరేషన్ బాగా పెంచాడట. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయనున్న సినిమా కోసం రూ. 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.  ఈ సినిమా కూడా విజయం సాధిస్తే అనిల్ త‌న రేటును రూ 12-13 కోట్ల‌కు పెంచేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌? 

దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts