నందమూరి ఇంట మళ్లీ మొదలైన రాజకీయపోరు

May 18, 2019 at 11:59 am

నంద‌మూరి తార‌క రామారావు ఈ పేరు ఎవ‌రికి ప‌రిచ‌యం అవ‌సరం లేనిది. కృష్ణుడు, రాముడు, రావ‌ణుడు లాంటి పాత్ర ఏదైనా ఆ పాత్ర రామారావే చేయాలి. సినిమాలో త‌న‌కు ఎదురు లేని ఎన్టీఆర్ అనుకోని ప‌రిస్థితిలో రాజ‌కీయ ప్ర‌వేశం చేసి సునామీ సృష్టించాడు. తెలుగువాడి ఆత్మ‌గౌర‌వం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9నెల‌ల కాలంలోనే అధికారం చేజిక్కుంచుకున్నారు. ఎన్టీఆర్ సాధించిన విజ‌యంతో ఢిల్లీ దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది. దేశంలోనే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పార్టీని స్థాపించి అధికారం సాధించి సంచ‌ల‌నం సృష్టించాడు ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్ టీడీపీని తిరుగులేని శ‌క్తిగా మార్చి తెలుగు జాతి గౌర‌వాన్ని కాపాడాడు. ఎన్టీఆర్ స్థాపించిన త‌న పార్టీ నుంచే చివ‌రాఖ‌ర‌కు అవ‌మాన‌క‌రంగా నిష్క్ర‌మించాడు. త‌న కుటుంబ స‌భ్యుల స‌హాకారం లేక‌పోవ‌డం, న‌మ్మిన నాయ‌కులు, కుటుంబ స‌భ్యుల మోసంతో టీడీపీ పార్టీ నుంచి తొలగించ‌బ‌డ్డాడు. ఆ త‌రువాత ఎన్టీఆర్ మ‌రో పార్టీని స్థాపించుకోవ‌డం, అది అనుకున్న మేర విజ‌యం సాధించ‌లేక‌పోవ‌డం, చివ‌రికి ఎన్టీఆర్ అకాల మ‌ర‌ణం చెందాడు.

ఎన్టీఆర్ నుంచి పార్టీ నాయ‌క‌త్వం ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చేతికొచ్చాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి చంద్ర‌బాబు నాయుడే సార‌ధ్య బాధ్య‌త‌లు వ‌హిస్తున్నాడు. అయితే ఇప్పుడు టీడీపీ సార‌ధ్య బాధ్య‌త‌ల‌పై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతుంది. టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న సీఎం చంద్ర‌బాబుకు వ‌య‌స్సు అయిపోతుంద‌ని, త‌రువాత టీడీపీ సార‌ధ్యం ఎవ‌రు వ‌హిస్తార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒక‌వేళ పార్టీ ప‌గ్గాల నుంచి త‌ప్పుకుంటే త‌దుప‌రి ఎవ‌రు వార‌సులు అనేది ఇప్ప‌టి నుంచే చ‌ర్చ జ‌రుగుతుంది. చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్‌ను చంద్ర‌బాబు త‌దుప‌రి వార‌సుడుగా ఇప్ప‌టికే ప‌ని అప్ప‌గించాడు. ఈ మేర‌కు ఎమ్మెల్సీగా చేసి త‌న క్యాబీనెట్‌లో ఐటీ మంత్రిగా నియ‌మించాడు. అయితే లోకేష్ త‌న తండ్రి అనుకున్న మేర‌కు రాణించ‌లేక‌పోతున్నాడు. లోకేష్‌కు ప్ర‌జ‌ల‌ల్లో ఉన్న ఇమేజ్ ఏంటంటే కేవ‌లం ట్విట్ట‌ర్ పిట్ట‌గానే పేరుంది.. కానీ రాజ‌కీయ నాయ‌కుడిగా ఏమాత్రం గుర్తించ‌డం లేద‌నేది స‌త్యం.

లోకేష్ ఒక‌వేళ టీడీపీకి ఫిట్ కాకుంటే త‌రువాత వారసుడు ఎవ‌రు అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఇప్పుడు అదే ప్ర‌శ్న ఎన్టీఆర్ కొడుకు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ మ‌నుమ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ న‌డుమ పోరు రాజేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బాబాయి అబ్బాయి ల అభిమానులు టీడీపీకి భ‌విష్య‌త్ నేత మా హీరో అంటే మా హీరో అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కొడుకుగా, చంద్ర‌బాబు నాయుడు వియ్యంకుడిగా, నారా లోకేష్‌కు మామ అయిన బాల‌కృష్ణ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశం భ‌విష్య‌త్‌లో ఉండ‌వ‌చ్చ‌నేది కొంద‌రి వాద‌న‌. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఆ అవ‌కాశం రావ‌డం అనేది క‌ష్ట‌త‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. జూ. ఎన్టీఆర్ అచ్చం సీనియ‌ర్ ఎన్టీఆర్‌లా ఉంటాడు. 2014ఎన్నిక‌ల్లో త‌న మామ చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రావ‌డానికి జూ.ఎన్టీఆర్ తీవ్ర‌మైన కృషి చేశారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న దూసుకుపోయాడు. ప్ర‌జ‌లు కూడా జూనియ‌ర్‌ను ఆద‌రించారు. జూనియ‌ర్‌కు పార్టీని న‌డిపే స‌త్తా ఉంద‌ని ఎన్నిక‌లే నిరూపించాయి. 2019 ఎన్నిక‌లో జూనియ‌ర్ సేవ‌ల‌ను చంద్ర‌బాబు పొంద‌లేదు. ఎందుకంటే త‌న కొడుకు లోకేష్‌కు పోటీగా నిలుస్తాడ‌నే భ‌యంతో చంద్ర‌బాబు జూనియ‌ర్‌ను దూరం పెట్టాడనే ప్ర‌చారంలో ఉంది. సో భ‌విష్య‌త్ నేత‌లుగా నారాలోకేష్‌, బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లో ఎవ‌రో ఒక‌రు కావ‌డం ఖాయ‌మైన‌ప్ప‌టికి అది ఎవ‌ర‌నేదే భ‌విష్య‌త్ నిర్ణ‌యించ‌నున్న‌ది.

నందమూరి ఇంట మళ్లీ మొదలైన రాజకీయపోరు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts