బాబు ఓట‌మి ఎఫెక్ట్‌.. టాలీవుడ్ వికెట్లు ట‌పా ట‌పా..!

May 27, 2019 at 4:34 pm

తెలుగు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో మెజార్టీ వర్గాలు కొమ్ముకాస్తున్నాయి అన్నది నిజం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో సహజంగానే ఇండస్ట్రీ వర్గాలు ఆయన వెంట నడుస్తూ వచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళలో చాలా మంది టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎంగా గెలవడం చిత్రపరిశ్రమకు కొన్ని మేళ్లు చేకూర్చటం, అలాగే చిత్ర పరిశ్రమ నుంచి కొంత మందిని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి వారిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసి కొన్ని కీలక పదవులు ఇవ్వడం జరిగాయి. దీనిని ఎవరు తప్పుపట్టలేం.

ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించాక ఇండస్ట్రీలో చాలా మంది ఆ తర్వాత క్రమక్రమంగా చంద్రబాబుకు దగ్గరయ్యారు. మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పథకాల రూపకల్పన, చంద్రబాబుకు స్క్రిప్ట్ రైటింగ్‌, టీడీపీకి ఎన్నికల్లో ప్రచారం చేయడం ఇలా చాలా పనులు చేసి పెట్టారు. ఎవరో మోహన్ బాబు లాంటి ఒకరిద్దరు తప్ప అందరూ చంద్రబాబు చెంత చేరి పోయారు. తమకు ఎంతో జన్మనిచ్చిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేయటం శోఛ‌నీయం. 2004 ఎన్నికలకు ముందు నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచారం చేసేందుకు గాని, తెర వెనక సపోర్ట్ చేసేందుకు గానీ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రాలేదు. దీనికి కారణం 2004 ఎన్నికల్లో కూడా చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం అవుతున్నారని వాళ్ళంతా కలలు కన్నారు. చివరకు వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వి, జీవిత‌- రాజ‌శేఖ‌ర్ దంప‌తులు ఇలా ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకే ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ స‌పోర్ట్ చేశారు.

2004లో వైఎస్ సీఎం అయ్యాక ఇండస్ట్రీ తీరులో కాస్త మార్పు వచ్చింది. మోహన్ బాబు, నాగార్జున లాంటి వాళ్లు వైఎస్‌కు అంతో ఇంతో సపోర్ట్ చేశారు. ఆ త‌ర్వాత మోహ‌న్‌బాబుకు, వైఎస్‌కు బంధుత్వం కూడా ఏర్ప‌డింది. 2009లో వైఎస్ తెలిసిన వెంటనే ఇండస్ట్రీ జనాలు దగ్గరకు క్యూ కట్టేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన జరగడంతో తెలంగాణ వరకు ఇండస్ట్రీ జనాలంతా పైకి చెప్పినా చెప్పకపోయినా అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఇచ్చేశారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే లెక్కలు ఎంత ? తేడా వస్తాయో వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఇక్కడ మళ్ళీ చంద్ర భజన ప్రారంభించారు. ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు చంద్రబాబు ఎన్నో చేస్తాడని కలలు కన్న ఇండస్ట్రీ పెద్దలకు కొద్దిరోజులకే కళ్ళు బైర్లు కమ్మాయి. ఎన్నికలకు ముందు చాలా మంది ఇక్కడ చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని వైఎస్. జగన్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు.

ఇండస్ట్రీలో మరి పెద్దవాళ్ళు కాకపోయినా మీడియం రేంజ్, ఇత‌ర‌త్రా చిన్న చిన్న హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా జగన్ కోసం ఏపీకి వచ్చి మరీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వైసిపికి అనుకూలంగా పూర్తి వన్ సైడ్ రావడంతో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు గెలుస్తాడని నమ్మిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఒక్కొక్కరు టిడిపికి ఎంత దూరంగా జ‌రిగితే అంత మంచిద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా మాత్ర‌మే కాకుండా… SVBC ఛాన‌ల్ చైర్మ‌న్ హోదాలో ఉన్న ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. వ‌యోఃభారాన్ని సాకుగా చూపింది ఆయ‌న త‌ప్పుకున్నా ఏపీ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డ‌యే ఆయ‌న ఈ ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని తెలుస్తోంది. ముందుగా ఛాన‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌దులుకున్న ఆయ‌న రేపో మాపో టీడీపీ బోర్డుకు కూడా రాజీనామ చేస్తారు. ఇక ఇండస్ట్రీలో టీడీపీకి అతి సన్నిహితంగా ఉండే కొందరు అగ్ర నిర్మాతలు సైతం జగన్ గెలుపు అభినందిస్తూ చిన్న ప్రకటన కూడా చేయలేదు.

ఇదిలా ఉంటే తెలుగులో అగ్ర హీరోగా ఉంటూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి అట్టర్ ప్లాప్ షో వేసిన చిరంజీవి సైతం జగన్ గెలుపును అభినందించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ల‌కు ఏపీలో మళ్ళీ ఏవైనా అవసరాలు ఉంటేనే జగన్ గుర్తుకు వస్తాడా ? అన్న చర్చలు కూడా సినిమా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు బాటలోనే మరికొందరు ఇండస్ట్రీ పెద్దలు కూడా టీడీపీకి క్రమక్రమంగా దూరం అవుతార‌ని సినిమా వర్గాల్లో వినిపిస్తున్నాయి.

బాబు ఓట‌మి ఎఫెక్ట్‌.. టాలీవుడ్ వికెట్లు ట‌పా ట‌పా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts