రీపోలింగ్ కు టీడీపీ డిమాండ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాలు ఇవే…

May 17, 2019 at 5:16 pm

ఏపీలో రీపోలింగ్ రగడ కొనసాగుతోంది. చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు, దేవినేని ఉమ స్పందించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాతశర్మకు వినతిపత్రం సమర్పించారు. మొత్తంగా చంద్రగిరిలో పాటు మరో 18 చోట్ల రీపోలింగ్ కు టీడీపీ డిమాండ్ చేశారు. ఈ పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని ఏప్రిల్‌ 11న కోరినప్పటికీ ఇంతవరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు విలేక‌రుల‌తో మాట్లాడుత రీ పోలింగ్ కు వైసీపీ వారు కోరిన వెంటనే అక్కడ అమలు చేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. రీ పోలింగ్ అనేది ఒకే సారి నిర్వహిస్తారని… గతంలో ఎక్కడా దశలవారీగా రీ-పోలింగ్ జరిపిన దాఖలాలు లేవని నక్కా ఆనందబాబు గుర్తుచేశారు. కౌంటింగ్ కు ఇంకా సమయం ఉన్నందున తాము డిమాండ్ చేస్తున్న 18 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మొత్తం 18 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని ఎప్పుడో కోరామని..దీనిపై ఎన్నికల సంఘం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

రీపోలింగ్ కు టీడీపీ డిమాండ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాలు ఇవే…

* నర్సరావుపేట నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లు -214, 215
* రాజంపేటలోని పోలింగ్‌ బూత్‌లు -78,130, 131, 132
* కోడూరు పరిధిలోని పోలింగ్‌ బూత్‌లు – 21, 244
* సత్యవేడులోని పోలింగ్‌ బూత్‌లు -80,81
* జమ్మలమడుగులోని పోలింగ్‌ బూత్‌లు -287, 288
* సత్తెనపల్లిలోని పోలింగ్‌ బూత్‌లు -160, 161, 162
* చంద్రగిరిలోని పోలింగ్‌ బూత్‌లు -310, 311, 323

రీపోలింగ్ కు టీడీపీ డిమాండ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాలు ఇవే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts